వినోదమే ప్రధానంగా ... | Rashmi Gautam First Look in Thanu Vacchenanta | Sakshi
Sakshi News home page

వినోదమే ప్రధానంగా ...

Published Sun, Mar 13 2016 10:49 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

వినోదమే ప్రధానంగా ...

వినోదమే ప్రధానంగా ...

వినోదమే ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తను.. వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్నారు. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రచయిత, దర్శకుడు బీవీయస్ రవి విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ కథలతో పాటు, హారర్, కామెడీ సినిమాల హవా ప్రస్తుతం కొనసాగుతోంది. సెంటిమెంట్ ఉండే కథలను కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రకథ, కథనం కొత్తగా ఉంటాయి. వినోద ప్రధానంగా సాగుతుంది. మిగిలిన మూడు పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బెక్కం రవీందర్, కెమేరా: రాజ్‌కుమార్, సంగీతం: రవిచంద్ర, సహ నిర్మాతలు: లావు శ్రీమన్నారాయణ, పి.యశ్వంత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement