వినోదం పక్కా | Rashmi Gautam Thanu Vachenanta Movie Songs | Sakshi
Sakshi News home page

వినోదం పక్కా

Sep 19 2016 11:28 PM | Updated on Sep 4 2017 2:08 PM

వినోదం పక్కా

వినోదం పక్కా

వినోదమే ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ‘తను..వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మీ గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల

 వినోదమే ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ‘తను..వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మీ గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మించారు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రం లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, పాటల సీడీని నిర్మాతలు బీఏ రాజు, కె.రాఘవేంద్రరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శీను ఆవిష్కరించారు. అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ -
 
 ‘‘ఇటీవల ప్రేమకథలు, హారర్, కామెడీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులకు నవ్వులు పంచాలనే ఉద్దేశంతో వినోదమే ప్రధానంగా ఈ చిత్రం నిర్మించాం. ఇందులో పలు ట్విస్ట్‌లు ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ఇప్పటికే మా చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. రాఘవేంద్రరెడ్డిగారు మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ నెలాఖరులో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, సహ నిర్మాత యశ్వంత్, పాటల రచయిత్రి డా. చల్లా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement