Thanu Vachenanta
-
కాజల చెలివా.. కరీనాకు కజిన వా..!
సీతంపేట : అందమైన అమ్మాయిలు ఒకే చోట సందడి చేస్తే... కెవ్వు కేక పెడితే..హార్ట బీట్ పెరగదా...మనసు ఉప్పొంగదా...కళ్లు మిరుమిట్లు గొలపవా...! అధరాలు మధురంగా నవ్వవా..సున్నితమైన ఆ చేతులు చప్పట్ల మోత మోగించవా...! ఈ సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలంతా ‘కళ’ర్‌ఫుల్‌గా బుల్లయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల్లో మెరిశారు. ఫ్రెషర్స్ డే వేడుకల్లో మతిపోగొట్టారు. నయా ఫ్యాషన్సకు బ్రాండ్ అంబాసిడర్లయ్యారు. హద్దులు లేవు..ఆంక్షలు లేవు..ఉన్నదంతా ఆకాశమంతా ఆనందం...కడిలి మురిసేలా సందడి..నేల పులకించేలా నాట్యవిన్యాసం. ర్యాంప్ వాక్..ఫ్యాషన్ షో..డ్యాన్సులు, పాటలు ఒకటేమిటి తమలో ఉన్న కళలన్నీ ప్రదర్శించారు. సందేశాత్మక నాటికలు, మూకీ ప్రదర్శనలతో, చలోక్తులు, కామెడీ స్కిట్స్‌తో ఆద్యంతం ఆహ్లాదపరిచారు. వీరిని మరింత ఉత్సాహాన్నిచ్చేందుకు ‘తనువచ్చెనంట’ చిత్ర యూనిట్ ఫ్రెషర్సడేకు అతిథులుగా వచ్చారు. ప్రముఖ యాంకర్, నటి రేష్మీ గౌతమ్, హీరో తేజ, కమెడియన్ చలాకీ చంటీ విద్యార్థులతో సందడి చేశారు. బ్యూటీలమధ్య సెల్ఫీలతో హోరెత్తించారు. తను వచ్చెనంట వినోదాత్మక చిత్రమని, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుందని అందరూ సినిమా చూసి ఆదరించాలని వీరు కోరారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ జి.మధుకుమార్ మాట్లాడుతూ వినోదం, ఆట పాటలే కాదు, విజ్ఞానం ప్రధానమన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. విద్యార్థి దశలో చదువు కీలకమైనదని, ఈ దశలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా రాణించగలరన్నారు. జూనియర్ విద్యార్థులను ఆహ్వానిస్తూ సీనియర్లు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలు , గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి.ఎస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎం.రెహమాన్, పీఆర్వో కె.సత్యనారాయణ, స్టూడెంట్ కో ఆర్డినేటర్ వి. రాధాదేవి పాల్గొన్నారు. -
నా నుంచి అభిమానులు ఏమి...
30న సినిమా విడుదల రేష్మీ గౌతమ్ బీచ్‌రోడ్: నగరంలో ‘తను వచ్చెనంట’ సినిమా టీమ్ సందడి చేసింది. తేజ, రేష్మీగౌతమ్ హీరో, హీరోయిన్లగా.. చలాకి చంటి ముఖ్యపాత్రలో చిత్రం రూపొందింది. వెంకట కాచర్ల దర్శకత్వంలో నిర్మాత చంద్ర శేఖర్ ఆజాద్ నిర్మించారు. ఈ నెల 30న విడుదల అవుతున్న సందర్భంగా నగరంలో చిత్ర యూనిట్ సందడి చేసింది. అనంతరం ఆర్కేబీచ్ దగ్గర వున్న ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేష్మీ గౌతమీ మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వ ర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. నా నుంచి అభిమానులు ఏమి కోరుకుంటున్నారో అన్నీ ‘తనువచ్చెనంట’లో ఉంటాయన్నారు. హీరో తేజ మాట్లాడుతూ ఇది హర్రర్, రొమాంటిక్ కామెడీ సినిమా అన్నారు. చిత్రంలో కామెడీ అద్భుతంగా పండిందన్నారు. తప్పకుండా అందర్నీ అలరిస్తుందన్నారు. నిర్మాత చంద్రశేఖర్, సహాయ నిర్మాత యశ్వాంత్ తదితరులు పాల్గొన్నారు. బీచ్‌ను చూస్తూ కాఫీ తాగితే ఆ కిక్కే వేరబ్బా...! సాగర్ తీరంలో పార్కేలేటర్ కాఫీ హౌస్ నిర్వహించిన సెల్ఫీ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన పదిమందితో తను వచ్చెనంట సినిమా టీమ్ డిన్నర్ చేసింది. రేష్మీ గౌతమ్, నటుడు చెలాకీ చంటీ తదితరులు యువతీయువకుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా పార్కెలేటర్ కాఫీ హౌస్ యజమాని మనుదీప్ రెడ్డి మాట్లాడుతూ షాపునకు వచ్చిన కస్టమర్లకు సెల్ఫీ పోటీలు నిర్వహించామని, వీరిలో పదిమందిని ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా రేష్మీ గౌతమీ మాట్లాడుతూ బీచ్‌ను చూస్తూ కాఫీ తాగడం చాలా ఇష్టమన్నారు. నటుడు చంటి మాట్లాడుతూ వైజాగ్ బీచ్‌ను ఎన్ని సార్లు చూసినా తనివితీరదన్నారు. ఈ కార్యక్రమంలో సెల్ఫీ కాంటెస్ట్ విజేతలు రేష్మీ, చంటిలతో సెల్ఫీలు, ఫొటోలు తీయించుకుని సందడిగా గడిపారు. -
వినోదం పక్కా
వినోదమే ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ‘తను..వచ్చెనంట’. తేజ కాకుమాను, రేష్మీ గౌతమ్, ధన్యా బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో వెంకట్ కాచర్ల దర్శకత్వంలో శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మించారు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రం లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, పాటల సీడీని నిర్మాతలు బీఏ రాజు, కె.రాఘవేంద్రరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శీను ఆవిష్కరించారు. అనంతరం చిత్ర దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇటీవల ప్రేమకథలు, హారర్, కామెడీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులకు నవ్వులు పంచాలనే ఉద్దేశంతో వినోదమే ప్రధానంగా ఈ చిత్రం నిర్మించాం. ఇందులో పలు ట్విస్ట్‌లు ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘ఇప్పటికే మా చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. రాఘవేంద్రరెడ్డిగారు మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ నెలాఖరులో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత చెప్పారు. తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, సహ నిర్మాత యశ్వంత్, పాటల రచయిత్రి డా. చల్లా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.