శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'రామ్‌' చిత్రం నుంచి పాట విడుదల | Srikanth Addala Released Song In RAM Rapid Action Mission Movie | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా 'రామ్‌' చిత్రం నుంచి పాట విడుదల

Published Sat, Jan 6 2024 9:02 PM | Last Updated on Sat, Jan 6 2024 9:02 PM

Srikanth Addala Released Song In RAM Rapid Action Mission Movie - Sakshi

యదార్థ ఘటనల ఆధారంగా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం సిద్దంగా ఉంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ఇక ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాటను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ పాటను రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'మనతోని కాదురా భై' అంటూ సాగే ఈ పాటకు.. రాము కుమార్ ఏఎస్‌కే సాహిత్యం, ధనుంజయ్ గాత్రం, ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ఇలా అన్నీ కలిసి వినసొంపుగా మార్చాయి.

కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement