కుర్రాళ్ల గుండెచప్పుడు | Youth Movie Press Meet | Sakshi
Sakshi News home page

కుర్రాళ్ల గుండెచప్పుడు

Feb 13 2020 5:32 AM | Updated on Feb 13 2020 5:32 AM

Youth Movie Press Meet - Sakshi

దిలీప్‌ రాజా, రావత్‌ సింధు

‘పండుగాడి ఫోటో స్టూడియో’ చిత్రదర్శ కుడు దిలీప్‌ రాజా తెరకెక్కించనున్న చిత్రం ‘యూత్‌’. ‘కుర్రాళ్ల గుండె చప్పుడు’ అన్నది ఉప శీర్షిక. ధన్య బాలకృష్ణ లీడ్‌ రోల్‌లో, రావత్‌ సింధు, వెన్నెల, ఆలోక్‌ జైన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. దిలీప్‌ రాజా మాట్లాడుతూ– ‘‘నా బలం, నా శ్రేయోభిలాషి అయిన డైరెక్టర్‌ సుకుమార్‌గారు కథ విని ఓకే అంటేనే ‘పండుగాడి ఫోటో స్టూడియో’ చేశాం.

ఇప్పుడు ‘యూత్‌’ కథ కూడా సుకుమార్‌గారు బాగుందంటేనే మొదలుపెడతాం. యువత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా రు? ఎలాంటి బాధలను భరిస్తున్నారో తెలియజెప్పేదే ఈ చిత్రకథ. ఈ చిత్రంలో హిందీ నుంచి ఇద్దరు, తమిళ్‌ నుంచి ఇద్దరు ప్రముఖ నటులు నటిస్తారు. మార్చిలో షూటింగ్‌ మొదలు పెట్టి సినిమాని జూన్‌లో రిలీజ్‌ చేయాల నుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుతం రెండు ట్యూ¯Œ ్స రెడీ అయ్యాయి’’ అన్నారు సంగీత దర్శకుడు యాజమాన్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement