కుర్రాళ్ల గుండె చప్పుడు | Dileep Raja is Youth resumes shoot in Goa | Sakshi
Sakshi News home page

కుర్రాళ్ల గుండె చప్పుడు

Published Tue, Sep 29 2020 6:33 AM | Last Updated on Tue, Sep 29 2020 6:33 AM

Dileep Raja is Youth resumes shoot in Goa - Sakshi

అలీతో ‘పండుగాడి ఫొటో స్టూడియో’ చిత్రాన్ని తెరకెక్కించిన దిలీప్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘యూత్‌’. ‘కుర్రాళ్ల గుండె చప్పుడు’ అనేది ట్యాగ్‌లైన్‌. బాపట్ల పార్లమెంట్‌ సభ్యుడు నందిగం సురేష్‌ సమర్పణలో పెదరావురు ఫిల్మ్‌ సిటీ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. షూటింగ్‌ని తిరిగి గోవాలో ప్రారంభించారు.

దిలీప్‌ రాజా మాట్లాడుతూ– ‘‘గోవా బీచ్‌ దగ్గర కొన్ని ఛేజింగ్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. జనవరిలో చివరి షెడ్యూల్‌ను ఏపీలోని 13 జిల్లాల్లో చిత్రీకరించాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమా కథను, నటీనటుల వివరాలను ప్రస్తుతానికి బహిర్గతం చేయడం లేదు. ఈ సినిమా కాకుండా ‘తను నేనూ ఒక్కటే’ అనే టైటిల్‌తో మరో సినిమా రూపొందించనున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement