ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ చేరారు. ఆయన జీవిత కథ ఆధారంగా ‘బాపట్ల ఎంపీ’అనే సినిమా తెరకెక్కుతుంది. అగస్త్య , నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేఖ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిగం వెంకట్ నిర్మిస్తున్నారు. నానాజీ మిరియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల ఎంపీ నందిగగం సురేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ఈ చిత్ర నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
(చదవండి: సెప్టెంబర్‌లో ఇన్ని చిత్రాలా?.. వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో?)
అనంతరం నిర్మాత నందిగం వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తమ్ముడు(నందిగం సురేశ్) నాతో చేసిన జర్నీ, తరువాత యూత్ ప్రెసిడెంట్ గా ఎదిగిన వైనం.. కొన్ని దుష్టశక్తులు కలిసి చేయలేని, చేయకూడని సంఘటనలో ఇరికించాని చూడడం, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి మద్దతుగా నిలవడం, ఆయన సపోర్ట్‌తో ఎలా ఎంపీ ఆయ్యాడనేదే ఈ సినిమా కథాంశం అన్నారు. ఈ కథ చెప్పడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది అని అన్నారు.
చిత్ర దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ.. ఇది బాపట్ల ఎం పి నందిగం సురేష్ లైఫ్ స్టోరీ. అరిటాకులు కొసుకొని బ్రతికే ఒక సామాన్య వ్యక్తి తన నిజాయితీ ని నమ్ముకొని, తను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ నిజాయితీగా ఉంటే. కొందరు వ్యక్తులు ఇతను చెయ్యని తప్పును ఇతను మీద రుద్దుతూ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బంది పెట్టినపుడు వైఎస్ జగన్ గారు చేరదీసీ, ఆయన సిద్దాంతాలు నచ్చి ఒక గొప్ప నాయకుడగా తీర్చిదిద్దారు.
సురేష్ అనే ఒక సామాన్య వ్యక్తికి వైఎస్ జగన్ ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు?. ఈ వ్యక్తి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ పడ్డాడు అనేదే ఈ కథ.ప్రతి సామాన్యుడు చూడాల్సిన సినిమా ఇది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే కచ్చితంగా ఎదుగుతాడు అనేది ఇందులో చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. ‘ఈ సినిమా కథను నానాజీ చెప్పినప్పుడు పొలిటికల్ స్టోరీ అని బయపడ్డాను. అయితే ఇందులో అదేమీ లేకుండా సామాన్యుడు అయిన తను ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు అనే స్టోరీ నాకు నచ్చింది’అని హీరో అగస్త్య అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హరోయిన్ నక్షత్ర అన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment