bapatla mp
-
Bapatla MP: తెరపై బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ బయోపిక్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ చేరారు. ఆయన జీవిత కథ ఆధారంగా ‘బాపట్ల ఎంపీ’అనే సినిమా తెరకెక్కుతుంది. అగస్త్య , నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేఖ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిగం వెంకట్ నిర్మిస్తున్నారు. నానాజీ మిరియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల ఎంపీ నందిగగం సురేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ఈ చిత్ర నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. (చదవండి: సెప్టెంబర్‌లో ఇన్ని చిత్రాలా?.. వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో?) అనంతరం నిర్మాత నందిగం వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తమ్ముడు(నందిగం సురేశ్) నాతో చేసిన జర్నీ, తరువాత యూత్ ప్రెసిడెంట్ గా ఎదిగిన వైనం.. కొన్ని దుష్టశక్తులు కలిసి చేయలేని, చేయకూడని సంఘటనలో ఇరికించాని చూడడం, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మద్దతుగా నిలవడం, ఆయన సపోర్ట్‌తో ఎలా ఎంపీ ఆయ్యాడనేదే ఈ సినిమా కథాంశం అన్నారు. ఈ కథ చెప్పడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది అని అన్నారు. చిత్ర దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ.. ఇది బాపట్ల ఎం పి నందిగం సురేష్ లైఫ్ స్టోరీ. అరిటాకులు కొసుకొని బ్రతికే ఒక సామాన్య వ్యక్తి తన నిజాయితీ ని నమ్ముకొని, తను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ నిజాయితీగా ఉంటే. కొందరు వ్యక్తులు ఇతను చెయ్యని తప్పును ఇతను మీద రుద్దుతూ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బంది పెట్టినపుడు వైఎస్ జగన్ గారు చేరదీసీ, ఆయన సిద్దాంతాలు నచ్చి ఒక గొప్ప నాయకుడగా తీర్చిదిద్దారు. సురేష్ అనే ఒక సామాన్య వ్యక్తికి వైఎస్ జగన్ ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు?. ఈ వ్యక్తి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ పడ్డాడు అనేదే ఈ కథ.ప్రతి సామాన్యుడు చూడాల్సిన సినిమా ఇది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే కచ్చితంగా ఎదుగుతాడు అనేది ఇందులో చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. ‘ఈ సినిమా కథను నానాజీ చెప్పినప్పుడు పొలిటికల్ స్టోరీ అని బయపడ్డాను. అయితే ఇందులో అదేమీ లేకుండా సామాన్యుడు అయిన తను ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు అనే స్టోరీ నాకు నచ్చింది’అని హీరో అగస్త్య అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హరోయిన్ నక్షత్ర అన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
కోటయ్యది రాజకీయ హత్యే..
సాక్షి, గుంటూరు : హత్యకు గురైన తెనాలికి చెందిన దళిత నాయకుడు పమిడిపాటి కోటయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు జీజీహెచ్ మార్చురీ వద్ద శుక్రవారం అప్పగించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మార్చురీ వద్దకు వచ్చి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. అక్కడ ఉన్న కోటయ్య బంధువులు, ప్రజాసంఘాల నాయకుల ఫిర్యాదులు విన్నారు. అందరికీ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర విచారణ చేపట్టి కోటయ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు రహితంగా అంతా ఇటువంటి చట్ట వ్యతిరేక ఘటనలను ఖండించాలన్నారు. నిందితులు ఎవరైనా సరే చట్టం చట్ట ప్రకారం శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాణం విలువైనదని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులతో చర్చించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని చెప్పారు. కోటయ్య కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎంపీతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కటివరపు దేవయ్య, ఆలూరి అంబేద్కర్, మేరుగ కిరణ్‌నాగ్ తదితరులు ఉన్నారు. జిల్లా అధికారులు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించిన నాయకులు జిల్లా కలెక్టర్ లేదా ఎస్పీ మార్చురీ వద్దకు వచ్చి కోటయ్య కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదలనీయమంటూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు, దళిత సంఘాల నాయకులు మార్చురీ గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్బంగా సమతా సైనిక్‌దళ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచికిచర్ల చిట్టిబాబు, ఏఐసీసీ నాయకులు జాన్ బెన్నిలింగమ్ ,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.భగవాన్‌దాసు, కె.వి.పి.ఎస్ జిల్లా కార్యదర్శి పి.కృష్ణమోహన్ మాట్లాడుతూ 11 నెలల క్రితం కోటయ్య కుమారుడు సత్యవంశీ హత్యకు గురయ్యాడని, పోలీసులు ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేయలేదని ఆరోపించారు. న్యాయం చేయమంటూ కోటయ్య అధికారులందరి చుట్టూ తిరిగినా జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో కోటయ్య వైఎస్సార్ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారని, ఈ నేపథ్యంలోనే రాజకీయ హత్య జరిగిందన్నారు. మాజీ ఎమ్యేల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు వ్యతిరేకంగా కోటయ్య సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్‌లు పెట్టాడని చెప్పారు. మాజీ ఎమ్యేల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఈ కేసులో ఎ–2గా చేర్చాలని డిమాండు చేశారు. ఆలపాటి, నక్కా ఆనంద్‌బాబు ప్రోత్సాహంతోనే... బీజేపీ వేమూరు నియోకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎమ్యేల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబులు ఈ హత్యలో ప్రత్యక్ష పాత్ర వహించారని ఆరోపించారు. వారి ప్రోత్సాహంతోనే వారి అనుచరులే ఈ హత్య చేశారని తెలిపారు. ఎస్పీ హామీతో ధర్నా విరమణ అర్బన్ ఎస్పీ పి.హెచ్డి.రామకృష్ణ మార్చురి వద్దకు వచ్చి కోటయ్య బంధువులు, దళిత నాయకులతో చర్చించారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ధర్నా విరమించారు. డీఎస్పీలు ప్రకాష్‌బాబు, రామాంజనేయులు ,నజీముద్దీన్, అర్బన్ పరిధిలోని పలు స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఎస్ఐలు, సిబ్బంది మార్చురి వద్ద ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజెప్పారు. అమృతలూరులో ఎమ్మార్పీఎస్ రాస్తారోకో చేబ్రోలు మండలం వేజెండ్ల, నారాకోడూరు గ్రామాల మధ్య నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పమిడిపాటి కోటయ్య మాదిగ శుక్రవారం రాత్రి హత్యకు గురవడంతో ఆయన స్వగ్రామం అమృతలూరులో రాస్తారోకో నిర్వహించారు. ఉత్తర దళితవాడలోని తెనాలి – చెరుకుపల్లి ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై శనివారం అమృతలూరు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సుమారు గంట సేపు రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా తాటిబొత్తలు వేసి, ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ కోటయ్య మాదిగను హత్య చేసిన అగంతకులను వెంటనే పట్టుకొని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ టీడీపీ నాయకుల కుట్రేనని అన్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చుండూరు సీఐ బి. నరసింహారావు ఆధ్వర్యంలో తెనాలి సీసీఎస్ సీఐ ప్రభాకర్, అమృతలూరు ఎస్ఐ జి. పాపారావు, పీఎస్ఐ షేక్ అమీనుద్దీన్, ఏఎస్ఐ హైమారావు, పోలీసు సిబ్బంది బందోబస్తు పర్యవేక్షించారు. రాస్తారోకోలో వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతార్లంక సురేష్, కనగాల ప్రభాకర్, మట్లపూడి కోటేశ్వరరావు, పార్టీ మండల యూత్ కన్వీనర్ బర్మా ప్రవీణ్‌కుమార్, నేతలు నన్నెపాగ భూషణం, మానుకొండ రోశయ్య, వేసపోగు శ్రీకాంత్, ఆరెమండ్ల సుధాకర్, ఆలూరి ప్రభాకరరావు, మహేష్ పాల్గొన్నారు. -
ఆ నిబద్ధతే ‘నందిగం’ను ఎంపీని చేసింది..
అతడు చావును చాలా దగ్గరగా చూశాడు. మరికొద్ది నిమిషాల్లో ఇక తన ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం అని కూడా ఫిక్స్ అయిపోయాడు. రాజధాని ప్రాంతంలో అరటి తోటలను తగలబెట్టిన సమయంలో టీడీపీ నేతల ఆదేశాలతో అతడిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. అయినప్పటికీ మనస్సాక్షికి కట్టుబడ్డాడు. ఎన్కౌంటర్ చేస్తామని, రైల్వే పట్టాలపై పడుకోబెడతామని... చంపేసి తన భార్యతో ఊడిగం చేయించుకుంటామని హింసించారు. జగన్ పేరు చెబితే వదిలేస్తామంటూ బేరసారాలకు దిగారు. అయినా అందుకు ఒప్పుకోకపోవడంతో మూడురోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. తోటను తగలబెట్టడంలో వైఎస్సార్ సీపీ ప్రమేయం ఉందని పోలీసులు చెప్పించే యత్నం చేసినా సురేష్ మాత్రం భయపడకుండా నిజం చెప్పారు తప్ప, ఎటువంటి భయాలకూ, ప్రలోభాలకూ లొంగలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు ద్వారా లబ్ది పొందిన అతడు ఆ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. మహానేత తనయుడికి వ్యతిరేకంగా చెప్పాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, పోలీస్ అధికారులు బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గలేదు. నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడ్డాడు. ఆ సామాన్యుడి మొండి ధైర్యమే....కలలో కూడా ఊహించని అవకాశాన్ని తలుపుతట్టింది. అతని నిబద్ధత, నిజాయితీ వైఎస్ జగన్‌ను ఆకట్టుకున్నాయి. చివరకు ఎవరూ ఊహించని విధంగా నందిగం సురేష్‌ను అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా గెలుపు బాధ్యతను ఆయన స్వీకరించమే కాకుండా చేతలలో చూపించారు. ఒకప్పుడు పొలం పనులు చేసుకునే వ్యక్తిని ఎంపీని చేసింది. అతడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ...ఆయన ప్రెస్మీట్లలో వెనకుండి టీవీలో కనిపిస్తే చాలనుకున్నవ్యక్తి ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన శ్రీరామ్ మాల్యాద్రి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ సామాన్య కార్యకర్తగా ఉన్న నందిగం సురేష్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ ఎంపీగా సురేష్ విజయం సాధించడం అందరినీ నివ్వెరపరిచింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం నందిగం సురేష్‌ను ఎంపీగా గెలుపొందేలా చేసింది. బాపట్ల పార్లమెంట్ స్థానానికి సామాన్య వ్యక్తిని బరిలో నిలిపిన జగన్ నిర్ణయాన్ని ఆమోదించిన ఓటర్లు అతనికి జై కొట్టారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో విజయం సాధించిన నందిగం సురేష్ ...గతంలో రాజధాని భూముల కోసం చేసిన పోరాటం చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంకు చెందిన నందిగం సురేష్ పదో తరగతితో చదువు ఆపేసి, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు తమ భూములు ఇవ్వడానికి ఎదురు తిరిగితే...వారిలో నందిగం సురేష్ కూడా ఉన్నారు. తమకున్న రెండెకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తెగేసి చెప్పి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని భూముల కోసం పోరాటం చేశారు. దాంతో కక్ష సాధింపు చర్యగా ఆయనపై కేసులు పెట్టారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగులబెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని చెప్పాలంటూ.. అతడిని పోలీసులు గన్ను నోట్లో పెట్టి మరీ బెదిరించారు. మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా చంపేస్తానని బెదిరింపులకు దిగారు. ఆఖరికి రూ.50 లక్షలు ఇస్తానని బేరమాడారు. చివరకు ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు సింపుల్‌గా సారీ చెప్పి పంపించేశారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంతటి అవకాశం కల్పించడం ఊహించలేదంటూ ఉండవల్లిలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. కూలీ పనులకు వెళ్లే తమ లాంటి వ్యక్తికి ఎంపీగా అవకాశం ఇచ్చారంటూ భావోద్వేగం నియంత్రించుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్న, మొన్నటి వరకూ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని టీవీల్లో, పేపర్లలో చూసే ఆయన ఏకంగా ఆయనను కలిసి ఫోటో దిగటం కలలో కూడా ఊహించనిది. అవకాశం ఇచ్చిన జగనన్న తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం, ఎదురైన అనుభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. -
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు
-
చీరాల టీడీపీలో ముసలం
ఆమంచి వర్సెస్ శ్రీరామ్ మాల్యాద్రి పతాక స్థాయికి చేరిన వర్గ విభేదాలు నవనిర్మాణ దీక్షకు ఎంపీని ఆహ్వానించని ఎమ్మెల్యే మాల్యాద్రి, పోతుల సునీత వర్గం గైర్హాజరు ఆగ్రహంతో రగులుతున్న ఎంపీ.. అధిష్టానానికి ఫిర్యాదు భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు ఒంగోలు: చీరాల టీడీపీలో ముసలం పుట్టింది. అధికార పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిల మధ్య వర్గపోరు పతాకస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఆమంచి అధికార పార్టీలో చేరడాన్ని అటు పోతుల సునీత, ఇటు ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రిలు ఆదిలోనే వ్యతిరేకించారు. అయినా ముఖ్యమంత్రి ఆమంచిని పార్టీలో చేర్చుకోవడంతో అధికార పార్టీలో వర్గ విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. తాజాగా సోమవారం చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి నిర్వహించిన నవనిర్మాణ దీక్ష సభకు ఎంపీ మాల్యాద్రి, సునీత వర్గాలు హాజరుకాలేదు. దీక్షకు జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావులు హాజరైనప్పటికీ అధికార పార్టీ ఎంపీ, నియోజకవర్గ టీడీపీ నేత హాజరుకాకపోవడంపై చర్చలు మొదలయ్యాయి. ఎంపీ శ్రీరామ్, సునీతను ఎమ్మెల్యే ఆమంచి ఆహ్వానించలేదని తెలుస్తోంది. అయినా ఇద్దరు మంత్రులు ఈ విషయం తమకెందుకన్నట్లు నోరు మెదపలేదని సమాచారం. అధికార పార్టీ కార్యక్రమానికి ఎంపీ హోదాలో ఉన్న తనను పిలవకపోవడంపై ఎంపీ మాల్యాద్రి ఆగ్రహం చెంది, అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కనీసం మంత్రులు కూడా మాటమాత్రం కూడా తనను పిలవకపోవడంపై మరింత ఆవేదన చెంది, ఈ విషయంపై ఇటు జిల్లా స్థాయి, అటు రాష్ట్రస్థాయి నేతలకు ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం పోతుల సునీత వర్గం ఒంగోలులో ఉన్న ఎంపీని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నాటి వైద్యశిబిరంలో విభేదాలకు బీజం.. చీరాల అధికార పార్టీలో ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, పోతుల సునీతలు ఒక వర్గంగా, ఆమంచి మరో వర్గంగా విడిపోయూరు. దీంతో అధికార పార్టీలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే పోతుల, ఆమంచి వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుండగా, తాజాగా ఎమ్మెల్యే బాపట్ల ఎంపీల మధ్య పోరు తీవ్రరూపం దాల్చుతోంది. ఆమంచి పార్టీలో చేరిన కొత్తలో ఎంపీ మాల్యాద్రి చీరాలలో మెడికల్ క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేతో పాటు సునీతను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సునీత వర్గాలు అక్కడే గొడవకు దిగాయి. దీంతో ఆమంచిని ఎంపీ మందలించడంతో వీరి మధ్య గొడవ జరిగింది. ఇక్కడే ఇరువర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఎంపీ చీరాలలో ప్రత్యేక వర్గం కూడగట్టుకుంటుండాన్ని ఆమంచి వర్గం జీర్ణించుకోలేకపోతుంది. నాలుగు నెలల క్రితం చీరాలలో జరిగిన అంబేద్కర్ భవన్ ప్రారంభానికి సైతం ఎమ్మెల్యే ఇద్దరు మంత్రులను ఆహ్వానించినా... ఎంపీని మాత్రం పిలవలేదు. తాజాగా నవ నిర్మాణ దీక్షకు సైతం పిలవకపోవడంతో మాల్యాద్రి, సునీత వర్గాలు ఒక్కటయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. -
మంత్రిని ప్రశ్నిస్తే... ఎంపీగారికి కోపం వచ్చింది
హైదరాబాద్: బ్యాంకులకు బకాయిపడినట్లు వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏ విషయమైనా కావాలనుకుంటే కంపెనీ ప్రతినిధులను కలుసుకోవాలని ఆయన తెలిపారు. శుక్రవారం నగరంలోని సీసీఎంబీ ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని... మొక్కలు నాటారు. అనంతరం సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ.. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం మరింత ప్రగతి సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి పదవి చేపట్టిన మీరు బ్యాంకులకు బకాయిలు పడినట్లు మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయని వాటిపై మీ స్పందన ఏమిటని విలేకర్లు సుజనాచౌదరిని ప్రశ్నించారు. దీనిపై సుజనాపై విధంగా స్పందించారు. సుజనా చౌదరిపై విలేకర్లు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో అక్కడే ఉన్న బాపట్ల టీడీపీ ఎంపీ మాల్యాద్రి అసహనానికి గురైయ్యారు. మీరు ఏ పత్రిక నుంచి వచ్చారు? ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారంటూ విలేకర్లపై బెదిరింపు ధోరణితో వ్యవహారించారు. మాల్యాద్రి తీరుపై విలేకర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాద కోల్పోవద్దంటూ మాల్యాద్రికి విలేకర్లు హితవు పలికారు.