వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో.. | Software Sudheer Telugu Movie Official Trailer Released | Sakshi
Sakshi News home page

పంచ్‌ డైలాగులతో ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ ట్రైలర్‌

Published Wed, Nov 27 2019 4:19 PM | Last Updated on Wed, Nov 27 2019 4:28 PM

Software Sudheer Telugu Movie Official Trailer Released - Sakshi

‘ఫోటోలు పంపిస్తాను వాట్సాప్‌లో ఉన్నావా అని అడిగితే.. లేదంకుల్‌ అమీర్‌పేటలో ఉన్నాను’ అంటూ అమాయకంగా చెబుతున్నాడు.

‘నీ దగ్గర అంతుందేంట్రా అంటే... అంతులేనంత’ అంటున్నాడు సుడిగాలి సుధీర్‌. ‘ఫోటోలు పంపిస్తాను వాట్సాప్‌లో ఉన్నావా అని అడిగితే.. లేదంకుల్‌ అమీర్‌పేటలో ఉన్నాను’ అంటూ అమాయకంగా చెబుతున్నాడు. ఇవన్నీ అతడి తొలి చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’.లోని డైలాగులు. ఈ సినిమా ట్రైలర్‌ నేడు విడుదలైంది. తనకు అలవాటైన పంచ్‌ డైలాగులు, డాన్స్‌తో సుధీర్‌ అదరగొట్టాడు. పనిలో పనిగా ఫైటింగ్‌లు చేసేశాడు. సుధీర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ట్రైలర్‌ ఉంది.

సుధీర్‌కు జోడిగా ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. నాజర్‌, సాయాజి షిండే, ఇంద్రజ, పృథ్విరాజ్‌, ఎన్‌.శివప్రసపాద్‌, గద్దర్‌ తదితరులు ఈ పాత్రల్లో నటించారు. (చదవండి: ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా అనుకున్నా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement