
‘‘మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మా ‘జగమే మాయ’ నిరూపించింది. ఇలానే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్‌తో వస్తాం’’ అని నటుడు చైతన్యా రావు అన్నారు. ధన్యా బాలకృష్ణ, చైతన్యా రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జగమే మాయ’. ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 15న రిలీజైంది.
ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉదయ్ కోలా మాట్లాడుతూ– ‘‘విడుదలైన అన్ని భాషల్లోనూ మా సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంది’’ అన్నారు. ‘‘ఉదయ్‌గారు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తోంది’’ అన్నారు సునీల్ పుప్పాల.
Comments
Please login to add a commentAdd a comment