Jagame Maya
-
సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక నిర్ణయం!
‘నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1973 మార్చిలో నా సినిమా (‘జగమే మాయ’) షూటింగ్ మొదలైంది. నన్ను హీరోగా పరిచయం చేసిన అట్లూరి పూర్ణచంద్రరావు, పీవీ సుబ్బారావుగార్లకు నా కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు మురళీమోహన్. చిత్రపరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మురళీమోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఓ 15 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటాననుకున్నాను. అందరి సహకారానికి అదృష్టం తోడవ్వడంతో 50 ఏళ్లు ఉండగలిగాను. తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లినందు వల్ల పదేళ్లు సినిమాలకు బ్రేక్ వచ్చింది. ఇక పూర్తిగా సినిమాలకు అంకితమవ్వాలను కుంటున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్‌ని. చనిపోయేంతవరకు సినిమాల్లో నటిస్తుంటానని, ఆ మాటను నిజం చేశారాయన. ఏయన్నార్‌గారి స్ఫూర్తితో ఇక నటనకే అంకితం అవుతాను’’ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ‘మిథునం’ చిత్ర సంగీత దర్శకుడు వీణాపాణి రాసిన ‘అమ్మే దైవం’ పాట వీడియోను రిలీజ్ చేశారు మురళీమోహన్. -
అన్ని భాషల్లో మా సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంది : నిర్మాత
‘‘మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మా ‘జగమే మాయ’ నిరూపించింది. ఇలానే ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్‌తో వస్తాం’’ అని నటుడు చైతన్యా రావు అన్నారు. ధన్యా బాలకృష్ణ, చైతన్యా రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో సునీల్ పుప్పాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జగమే మాయ’. ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 15న రిలీజైంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఉదయ్ కోలా మాట్లాడుతూ– ‘‘విడుదలైన అన్ని భాషల్లోనూ మా సినిమా టాప్ ట్రెండింగ్‌లో ఉంది’’ అన్నారు. ‘‘ఉదయ్‌గారు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తోంది’’ అన్నారు సునీల్ పుప్పాల. -
జగమే మాయ
తన స్వార్థం కోసం మనిషి ఎలాంటి మాయలు చేస్తాడు? ఎత్తుకు పైఎత్తు వేసి ఎదుటి వ్యక్తిని ఎలా చిత్తు చేస్తాడు? అనే అంశాలతో శ్రీ సాయి తిరుమల ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘జగమే మాయ’. జాహ్నవి కటకం సమర్పణలో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ప్రసాద్ ఉప్పుటూరి నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సునీల్ కాశ్యప్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభి స్తోంది. కామెడీ, యాక్షన్ సమాహారంతో సాగే యూత్‌ఫుల్ ఎంట ర్‌టైనర్ ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. శివబాలాజీ, సిద్ధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: షాబీర్ షా, లైన్ ప్రొడ్యూసర్: భీమనేని తిరుపతిరాయుడు. -
'జగమే మాయ' పాటలు
అవసరానికి, అత్యాశకి మధ్య జరిగిన పోరాటమే ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘జగమే మాయ’. శివబాలాజీ, సిద్దూ, క్రాంతి, చిన్మయి, గజల్, సావేరి ముఖ్య తారలు. మహేష్ ఉప్పుటూరి దర్శకుడు. ప్రసాద్ ఉప్పుటూరి నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంచు మనోజ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీకాంత్‌కి అందించారు. ముఖ్యఅతిథులుగా పాల్గొన్న భీమనేని శ్రీనివాసరావు, సునీల్, బాలాదిత్య, వెన్నెల కిషోర్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇది తమ కలల చిత్రమని, చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. మంచి సినిమాకు సంగీతం అందించే అవకాశాన్నిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని సునీల్ కశ్యప్ అన్నారు. విజయమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమాకు పనిచేశామని శివబాలాజీ చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులందరూ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. -
జగమే మాయ
‘జగమే మాయ...’ పేరుతో శ్రీ సాయి తిరుమల ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. జాహ్నవి కటకం సమర్పణలో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ప్రసాద్ ఉప్పుటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 6న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘కామెడీ, యాక్షన్ సమాహారంతో సాగే సినిమా ఇది. ‘జగమే మాయ’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటలు, సినిమా కూడా అందరి ఆదరణ పొందుతాయనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. శివబాలాజీ, సిద్ధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: షాబీర్ షా, లైన్ ప్రొడ్యూసర్: భీమనేని తిరుపతిరాయుడు.