జగమే మాయ
జగమే మాయ
Published Thu, Oct 10 2013 2:11 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
తన స్వార్థం కోసం మనిషి ఎలాంటి మాయలు చేస్తాడు? ఎత్తుకు పైఎత్తు వేసి ఎదుటి వ్యక్తిని ఎలా చిత్తు చేస్తాడు? అనే అంశాలతో శ్రీ సాయి తిరుమల ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘జగమే మాయ’. జాహ్నవి కటకం సమర్పణలో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ప్రసాద్ ఉప్పుటూరి నిర్మించారు.
త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సునీల్ కాశ్యప్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభి స్తోంది. కామెడీ, యాక్షన్ సమాహారంతో సాగే యూత్‌ఫుల్ ఎంట ర్‌టైనర్ ఇది.
కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. శివబాలాజీ, సిద్ధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: షాబీర్ షా, లైన్ ప్రొడ్యూసర్: భీమనేని తిరుపతిరాయుడు.
Advertisement
Advertisement