'జగమే మాయ' పాటలు
'జగమే మాయ' పాటలు
Published Sat, Sep 14 2013 12:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
అవసరానికి, అత్యాశకి మధ్య జరిగిన పోరాటమే ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘జగమే మాయ’. శివబాలాజీ, సిద్దూ, క్రాంతి, చిన్మయి, గజల్, సావేరి ముఖ్య తారలు. మహేష్ ఉప్పుటూరి దర్శకుడు. ప్రసాద్ ఉప్పుటూరి నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మంచు మనోజ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీకాంత్‌కి అందించారు.
ముఖ్యఅతిథులుగా పాల్గొన్న భీమనేని శ్రీనివాసరావు, సునీల్, బాలాదిత్య, వెన్నెల కిషోర్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇది తమ కలల చిత్రమని, చాలా కష్టపడి ఇష్టపడి చేసిన ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు.
మంచి సినిమాకు సంగీతం అందించే అవకాశాన్నిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలని సునీల్ కశ్యప్ అన్నారు. విజయమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమాకు పనిచేశామని శివబాలాజీ చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులందరూ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement