జగమే మాయ
జగమే మాయ
Published Mon, Sep 2 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
‘జగమే మాయ...’ పేరుతో శ్రీ సాయి తిరుమల ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. జాహ్నవి కటకం సమర్పణలో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ప్రసాద్ ఉప్పుటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 6న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘కామెడీ, యాక్షన్ సమాహారంతో సాగే సినిమా ఇది. ‘జగమే మాయ’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది.
ఈ పాటలు, సినిమా కూడా అందరి ఆదరణ పొందుతాయనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. శివబాలాజీ, సిద్ధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: షాబీర్ షా, లైన్ ప్రొడ్యూసర్: భీమనేని తిరుపతిరాయుడు.
Advertisement
Advertisement