ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా? అనుకున్నా | Software Sudheer Movie Press Meet | Sakshi
Sakshi News home page

ఫిల్మ్‌ చాంబర్‌లోకి రానిస్తారా? అనుకున్నా

Published Fri, Nov 8 2019 12:29 AM | Last Updated on Fri, Nov 8 2019 12:29 AM

Software Sudheer Movie Press Meet - Sakshi

ధన్యాబాలకృష్ణ, సుడిగాలి సుధీర్‌

‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్‌ షోస్‌ ద్వారా ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై  పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు నిర్మించారు. డిసెంబర్‌ మొదటి వారంలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘ఒక ట్రెండీ కంటెంట్‌తో సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రమిది. వినోదంతో పాటు వాణిజ్య అంశాలున్నాయి. సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. సుధీర్‌ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఒక ఫీస్ట్‌లా ఉంటుంది’’ అన్నారు.

‘‘సుధీర్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అన్నారు ధన్యా బాలకృష్ణ. ‘‘నాకిది మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. మా సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కె. శేఖర్‌ రాజు. సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల కిందట హైదరాబాద్‌ వచ్చి ఫిల్మ్‌ చాంబర్‌ ముందుగా వెళ్తూ.. మనల్ని లోపలికి రానిస్తారా? లేదా? అనుకున్నాను. అలాం టిది ఇవాళ నా ఫస్ట్‌ సినిమా ప్రెస్‌మీట్‌ ఇక్కడ జరగడానికి ఆ దేవుడు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం అనుకుంటున్నాను. మార్చి 20న నా రెండు సినిమాలు షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాయి. నాకు ఇష్టమైన రజినీకాంత్, పవన్‌ కల్యాణ్‌గార్లను ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రంలో అనుకరించా’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement