
రుద్రా„Š
‘‘సినిమా తీయడం చాలా ఈజీ. కానీ దాన్ని రిలీజ్ చేయడం నరకం’ అనే విషయాన్ని ‘హల్ చల్’ సినిమా ద్వారా తెలుసుకున్నాను’’ అన్నారు రుద్రాక్ష్.. శ్రీపతి కర్రి దర్శకత్వంలో రుద్రాక్ష్, ధన్యా బాలకృష్ణ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హల్ చల్’. గణేష్ కొల్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 3న విడుదలైంది. ఈ సందర్భంగా రుద్రాక్ష్ మాట్లాడుతూ– ‘‘గ్రాడ్యువేషన్ పూర్తయ్యాక సినిమాల్లో నటించాలని యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను.
‘బొమ్మరిల్లు, షాక్, యువత, రక్త చరిత్ర, హైదరాబాద్ నవాబ్స్’ వంటి సినిమాల్లో నటించాను. ‘యువత’ నాకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. ‘లాస్ట్ బెంచ్ స్టూడెంట్, ఓం శాంతి’ సినిమాల్లో విలన్‌గానూ నటించాను. సహాయ నటుడిగా గుర్తింపు రాగానే వరుసగా ఆఫర్స్ అన్నీ నా దగ్గరకు వస్తాయనుకున్నాను. కానీ అలా జరగదని తెలియడానికి టైమ్ పట్టింది (నవ్వుతూ). తమిళంలో విజయ్ సేతుపతిలా విభిన్నమైన స్క్రిప్ట్‌లు చేసి, ఆయనలా పేరు తెచ్చుకోవాలన్నది నటుడిగా నా ఆశయం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment