ఫస్ట్‌క్లాస్‌గా... సెకండ్ హ్యాండ్ | Famous writer and director BVS Ravi has been producing a film titled 'Second Hand' | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌క్లాస్‌గా... సెకండ్ హ్యాండ్

Published Thu, Sep 19 2013 2:04 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఫస్ట్‌క్లాస్‌గా... సెకండ్ హ్యాండ్ - Sakshi

ఫస్ట్‌క్లాస్‌గా... సెకండ్ హ్యాండ్

‘‘ఈ టైటిల్ ‘సెకండ్ హ్యాండ్’ అయినా పాటలు, ట్రైలర్స్ మాత్రం ఫస్ట్‌క్లాస్‌గా ఉన్నాయి. బీవీయస్ రవి నాకు రెండేళ్లుగా తెలుసు. మంచి రచయిత, క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు. తనకున్న ప్రతిభను 10 శాతం వినియోగించినా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు రామ్‌గోపాల్‌వర్మ. 
 
 సుధీర్‌వర్మ, ధన్య బాలకృష్ణన్, కిరీటి, అనూజ్‌రామ్ ముఖ్య తారలుగా మల్టీడైమన్షన్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో పూర్ణనాయుడు నిర్మించిన చిత్రం ‘సెకండ్ హ్యాండ్. బీవీయస్ రవి సహనిర్మాత. కిషోర్ తిరుమల దర్శకుడు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించారు. ‘‘నేను నటించిన ‘నేను మీకు తెలుసా’కి రచయితగా చేసిన కిషోర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. మంచి టాలెంట్ ఉన్నవాడు’’ అని మనోజ్ చెప్పారు.
 
 ‘‘ఈ సినిమా కోసం సింగిల్ టేక్‌లో తీసిన పాట చాలా క్వాలిటీగా ఉంది’’ అని హరీష్‌శంకర్ తెలిపారు. బీవీయస్ రవి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని కిషోర్ అద్భుతంగా తీశాడు. అతని సోదరుల్లో ఒకరు సంగీతదర్శకుడిగా, మరొకరు ఛాయాగ్రాహకుడిగా చేశారు’’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల సుధీర్‌వర్మ, ధన్య బాలకృష్ణ, కిరీటి, అనూజ్‌రామ్ ఆనందం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement