Second Hand
-
Africa : పాత దుస్తులే వాళ్లకి ఫ్యాషన్!
సాక్షి, అమరావతి: అమెరికా, చైనా వంటి అగ్ర దేశాల్లో వాడేసి వదిలేసిన పాత దుస్తులే ఆఫ్రికా ప్రజలకు కొత్త ఫ్యాషన్. దీంతో ఆఫ్రికా ఖండాన్ని సెకండ్ హ్యాండ్ వ్రస్తాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి టన్నుల కొద్దీ పాత దుస్తుల్ని దిగుమతి చేసుకుని పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో 50 శాతం పైగా వాడుకోవడానికి వీలుగా లేక పోవడంతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. ఆ దుస్తులు ఆఫ్రికాలోని పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఆఫ్రికా దేశాల్లోనే పండిస్తున్నా.. పేదరికం కారణంగా అక్కడి ప్రజలు మాత్రం దిగుమతి చేసుకున్న సెకెండ్ హ్యాండ్ దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇటీవల ‘ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా’ ద్వారా ఖండం అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల వ్యాపారాన్ని నిషేధించాలని నిర్ణయించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. లక్షల టన్నుల్లో దిగుమతి ఆఫ్రికా ఖండంలో మాగ్రెబ్ (అరబ్ సంస్కృతి గల దేశాలు), సబ్ సహారా దేశాలు ఉన్నాయి. 2021లో మాగ్రెబ్ దేశాల్లో సెకండ్ హ్యాండ్ దుస్తుల మొత్తం దిగుమతులు సుమారు 107 మిలియన్ డాలర్లు కాగా, సబ్ సహారాలో 1,734 మిలియన్ డాలర్లుకు పైగా ఉంది. ‘గ్రీన్‌పీస్ ఆఫ్రికా’ సంస్థ సర్వే ప్రకారం మడగాస్కర్ ఏటా లక్ష టన్నుల సెకండ్ హ్యాండ్ దుస్తులను దిగుమతి చేసుకుంటే, కెన్యా 900 మిలియన్ల దుస్తులు, ఘనా 720 మిలియన్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. పాత వ్రస్తాల దిగుమతిపై సరైన చట్టాలు లేకపోవడం, చెత్తగా మిగిలిన వాటిని ప్రాసెస్ చేయడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఈ దేశాలు సెకండ్ హ్యాండ్ దుస్తుల చెత్త కుప్పలుగా మారుతున్నాయి. దిగుమతైన దుస్తుల్లో 60% పైగా ప్లాస్టిక్ కలిసిన వ్రస్తాలే ఉండడంతో వాటిని తగులబెట్టినా.. భూమిలో పాతిపెట్టినా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ట్రాషన్: ది స్టెల్త్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ క్లాత్స్ టు కెన్యా’ నివేదిక ఆఫ్రికాకు సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులు డిమాండ్‌ను మించిపోయాయని, అవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యర్థాల వల్ల నదులు, సముద్రాలు, పట్టణాలు, అడవులు, ప్రజల ఆరోగ్యం కలుíÙతమవుతున్నట్టు నివేదించింది. ఈ దేశాల్లో 2029 నాటికి సెకెండ్ హ్యాండ్ దుస్తుల వార్షిక విలువ 27.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఆఫ్రికా మొత్తం ఆదాయంలో 12.4 శాతం. ఆఫ్రికాలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాల్లో చవకైన దుస్తులకు డిమాండ్ ఉంది. అక్కడ వ్యవసాయం తర్వాత సెకండ్ హ్యాండ్ వస్త్రాల మార్కెట్టే అతిపెద్ద ఉపాధి రంగం. ఈ తరహా దుస్తులకు అతిపెద్ద ఎగుమతిదారు బ్రిటన్. ఆ దేశం నుంచి 14 మిలియన్ టన్నులు, అమెరికా నుంచి 7 లక్షల టన్నులు వాడేసిన దుస్తులను ఏటా ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుండగా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ నుంచి కూడా ఆఫ్రికాకు ఈ వ్రస్తాలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క ఘనా దేశానికే ప్రతివారం యూరప్, యూఎస్, ఆ్రస్టేలియా నుంచి 15 మిలియన్ల సెకండ్ హ్యాండ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. సెకెండ్‌హ్యాండ్ దుస్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే కెన్యాలో ప్రతిరోజూ 4 వేల టన్నుల వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కెన్యా ప్రభుత్వానికి సెకండ్ హ్యాండ్ వ్రస్తాల దిగుమతి, ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన వాటిపై విధించే పన్ను ముఖ్య ఆదాయ వనరు. ఈ దేశంలో 91.5 శాతం కుటుంబాలు సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేస్తున్నాయని అంచనా. పత్తి ప్రధాన ఉత్పత్తిదారైన జింబాబ్వే పెట్టుబడుల కొరత కారణంగా 85 శాతం పత్తిని ఎగుమతి చేస్తూ, 95 శాతం వ్రస్తాలు దిగుమతి చేసుకుంటోంది. గ్రీన్‌పీస్ ఆఫ్రికా 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలకు విరాళంగా ఇచ్చే సెకెండ్ హ్యాండ్ దుస్తుల్లో 40 శాతం పైగా ధరించేందుకు పనికిరానివే. వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడమో, నదుల్లో పారవేయడమో చేస్తున్నారు. -
వామ్మో! సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ విలువ ఇన్ని కోట్లా..!
మన దేశంలో కొత్త మొబైల్స్‌తో పోటీగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ విక్రయాలు జరుగుతున్నాయి. మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ ఐసీఈఏ, పరిశోధన సంస్థ ఐడీసీ కలిసి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2025 నాటికి ఇప్పుడున్న దానికంటే రెట్టింపు స్థాయిలో పెరిగి 4.6 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 34,500 కోట్లు) ఉంటుందని అంచనా. వినియోగదారులు ఈ ఏడాదిలో 2.3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.17,250 కోట్లు) విలువ గల 25 మిలియన్ సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసినట్లు ఈ నివేదికలో తేలింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ సగటు ధర 94 డాలర్ల(సుమారు రూ. 7,050)గా ఉన్నట్లు నివేదిక తెలిపింది. "ఈ మార్కెట్ పెరుగుదల వల్ల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు" ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ నివేదికను ప్రారంభించిన సందర్భంగా తెలిపారు. మొత్తం సెకండ్ హ్యాండ్ స్మార్ట్ఫోన్లలో 95 శాతానికి పైగా ఎలాంటి డ్యామేజ్ కాకముందే విక్రయస్తున్నారని, మిగిలిన ఐదు శాతం స్మార్ట్ఫోన్లను రిపేర్ వచ్చినప్పుడు విక్రయిస్తున్నారు. "వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అతిపెద్ద వాటా(90 శాతానికి పైగా)ను కలిగి ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్స్, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు వంటి ఇతర పరికరాల విక్రయాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయి" అని నివేదిక తెలిపింది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారుల్లో 78 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000 కంటే తక్కువగా ఉంటే, 18 శాతం మంది నెలవారీ ఆదాయం రూ.30,000-రూ.50,000గా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. (చదవండి: షోరూంలో అవమానం.. ఇంటికే బొలెరో డోర్ డెలివరీ!) -
సెకండ్ హ్యాండ్ అంటే చీప్‌గా చూడకండి.. కళ్లు బైర్లు కమ్మే వ్యాపారమక్కడ
ఇండియాలో సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతుందని మార్కెట రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి. ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపిన వివరాల ప్రకారం 2021లో ఇండియాలో మొత్తం 2.50 కోట్ల మొబైల్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముడయ్యాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో సగటున ఒక్కో ఫోన ధర రూ.6,900లుగా ఉంటోంది. దీనికి సంబంధించి 2.3 బిలియన్ డాలర్ల లావాదేవీలు (ఇండియన్ కరెన్సీలో రూ.1.72 లక్షల కోట్లు) జరిగాయి. కరోనాకి ముందు ఇండియాలో సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్‌కి ఇంత డిమాండ్ లేదు. ఐసీఈఏ లెక్కల ప్రకారం 2019 నుంచి 2021 వరకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 14 శాతం వృద్ధి నమోదు అయ్యింది. ఇదే ట్రెండ్ కొనసాగితే 2025 నాటికి సెకండ హ్యాండ్ ఫోన్ మార్కెట్ 5.10 కోట్ల ఫోన్ల అమ్మకాలతో 4.6 బిలియన్ డాలర్ల (రూ.3.44 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని అంచనా. గత ఐదేళ్లుగా ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. ఐదుకు పైగా కంపెనీలు పోటీ పడుతున్నాయి. క్రమం తప్పకుండా సరికొత్త ఫీచర్లతో మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఫలితంగా సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ పెరిగింది. 2020 వరకు 6 కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్లో ఉంటే 2021లోనే 9 కోట్ల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో 2.50 కోట్ల ఫోన్లు చేతులు మారాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి 90 శాతం ఫోన్లు యాజ్ ఇట్ ఈజ్‌గా ఒకరి నుంచి ఒకరికి మారిపోతున్నాయి. కేవలం 5 శాతం ఫోన్లు మాత్రమే కొంచెం రిపేర్, రిఫర్బీష్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. నెలకు రూ.30 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో జరుగుతున్న లావాదేవీల్లో వీరి వాట ఏకంగా 78 శాతంగా నమోదు అయ్యింది. -
చై నుంచి రూ.50 కోట్లు దోచుకుందంటూ ట్వీట్.. స్పందించిన సామ్
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారన్నది ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఈ విషయంపై ఇప్పటివరకు చై-సామ్ పెదవి విప్పలేదు. మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ అక్టోబర్2న వీరు తాము భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి సమంతనే టార్గెట్ కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ నెటిజన్ సమంతను..'విడాకులు తీసుకొని పాడైన ఓ సెకండ్ హ్యాండ్ ఐటెం' అంటూ దారుణంగా దూషించాడు. అంతేకాకుండా జెంటిల్మెన్(నాగ చైతన్య) నుంచి అప్పనంగా రూ. 50కోట్లు దోచుకుందంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సమంత.. నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక అంటూ తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇలాంటి చెత్త కామెంట్లకు సమంత స్పందించాల్సిన అవసరం లేదని, తామంతా ఆమెకు మద్దతుగా నిలుస్తాం’ అంటూ సామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
ఫోన్ల విక్రయంలో.. హైదరాబాదీలు నిజాలే చెప్తారు
సెకండ్ హ్యాండ్లో స్మార్ట్‌ఫోన్ అన్ లైన్లో కొనాలంటే మనకొచ్చే మెయిన్ డౌట్ కొన్నాక ఫోన్ సరిగా పనిచేస్తుందో లేదోనని? అయితే ప్రీఓన్ట్ మొబైల్స్ విక్రయం విషయంలో మాత్రం హైదరాబాదీలు అన్ని వివరాలు పక్కాగా, నిజాలే చెబుతారంట. యూజ్జ్ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల వినియోగదారులు 'టాప్ సెల్లింగ్ జాబితాలో నిలిస్తే.. హైదరాబాద్ చెన్నైవాసులు మాత్రం 'ట్రూత్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. స్మార్ట్ఫోన్ల అమ్మకంలో వాస్తవ పరిస్థితిని అత్యంత నిజాయితీగా వివరిస్తున్నారని అన్ లైన్లో యూజ్జ్ ఫోన్లను విక్రయించే కంపెనీ క్యాషిఫై పేర్కొంది. ఘజియాబాద్, ఫరీదాబాద్ అహ్మదాబాద్ లక్నో వంటి శాటిలైట్ టౌన్స్లలోను సెకండ్స్ మొబైల్స్ మార్కెటక డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. 2020లో ప్రీఓన్ట్ ఫోన్లు అత్యధిక రిపేర్లు కలిగిన నగరంలో ఢిల్లీ నిలిచిందని క్యాషిఫై 'యూజర్ బిహేవియర్ వైట్‌పేపర్ ఐదవ వార్షిక నివేదిక వెల్లడించింది. టాప్ బ్రాండ్ షావోమీ, యాపిల్ ప్రపంచ ప్రీఓన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇండియా రెండో అతిపెద్ద దేశం. దేశంలో సగటు భారతీయుడు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన 14-18 నెల ఒకసారి అప్‌గ్రేడ్ కోసం చూస్తున్నారని క్యాషిఫై కో-ఫొండర్ అండ్ సీఓఓ నకుల్ కుమార్ తెలిపారు. హైస్పీడ్ నెట్వర్క్ కనెక్టివిటీ(3జీ నుంచి 4జీ), ఆన్లైన్ తరగతుల కోసం ఎక్కవగా ప్రీఓన్డ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2020లో సెకండ్‌హ్యాండ్ ఫోన్లు ఎక్కువ విక్రయమైన బ్రాండ్లలో 26 శాతం వాటాతో షావోమీ అగ్రస్థాసంలో నిలవగా... 20 శాతంతో యాపిల్, 16 శాతంతో శామ్సంగ్, వివో, మోటరోలా (ఒక్కోటి 6 శాతం) వరుసగా తర్వాతి స్థానాలలో నిలిచాయి. రూ.10 వేల లోపు ధర ఉన్న స్మార్ట్ఫోన్లనే వినియోగదారులు ఎక్కవగా విక్రయించారు. ఐఫోన్-7, రెడ్మీ నోట్ 4, వన్‌ప్లస్ 6 హాటెస్ట్ స్మార్ట్ఫోన్లలో జాబితాలో నిలిచాయి. కనీసం మూడేళ్ల వయసున్న ఫోన్లు, సగటున రూ.4,217లకు ప్రీఓన్డ్ ఫోన్లను విక్రయించారు. చదవండి: స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త! -
సెకండ్ హ్యాండ్ వాహనాలు ఖరీదు చేస్తామని..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్మీ అధికారుల మాదిరిగా సంప్రదింపులు జరుపుతూ, వివిధ యాడ్స్ యాప్స్‌లో పోస్టు చేసిన సెకండ్ హ్యాండ్ వాహనాలు/వస్తువుల ఖరీదు చేస్తామంటూ టోకరా వేసే సైబర్ నేరగాళ్లు తమ పంథా మార్చారు. వీరు కొత్తగా ఆర్మీ మిషనరీ ప్రొసీజర్ పేరుతో టోకరా వేస్తున్నారు. ఖరీదు చేసిన వస్తువుకు రేటు చెల్లించకుండా ఆ మొత్తం తమ ఖాతాల్లో వేయించుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా కేసుల సంఖ్య పెరిగిందని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. ఈ తరహాలో రూ.50 వేలు మోసపోయిన ఓ వైద్య విద్యార్థి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదైంది. సదరు ఎంబీబీఎస్ స్టూడెంట్ తన వద్ద ఉన్న ఎక్సర్సైజ్ చైర్ విక్రయిస్తానంటూ ఓఎల్ఎక్స్లో పోస్టు చేయగా, ఉత్తరాదికి చెందిన ఆర్మీ అధికారిగా అతడికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. బేరసారాల అనంతరం రూ.15 వేలకు దానిని కొనుగోలు చేస్తానని చెప్పాడు. అయితే ఆర్మీ మిషనరీ ప్రొసీజర్ ప్రకారం నేరుగా డబ్బు చెల్లించడం సాధ్యం కాదని అన్నాడు. అందుకు సమానమైన మొత్తాన్ని గూగుల్ పే ద్వారా తమకు పంపిస్తే... దానికి రెట్టింపు తమ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందని ఎర వేశాడు. అదెలా సాధ్యమంటూ వైద్య విద్యార్థి ప్రశ్నించగా.. అనుమానం ఉంటే తొలుత రూ.5 పంపి పరీక్షించుకోవాలని చెప్పాడు. దీంతో ఆ విద్యార్థి ఆర్మీ అధికారి చెప్పిన ఫోన్ నంబర్‌కు రూ.5 పంపాడు. అప్పటికే రూ.10కి క్యూఆర్ కోడ్ సిద్ధం చేసి ఉంచిన సైబర్ నేరగాడు వెంటనే దాన్ని తిప్పి పంపాడు. అలా విద్యార్థి ఖాతాలోకి రూ.10 వచ్చి పడ్డాయి. దీంతో అతడి మాటలు నిజమని నమ్మిన వైద్య విద్యార్థి రూ.15 వేలు గూగుల్ పే ద్వారా సైబర్ నేరగాడి ఫోన్‌కు పంపాడు. కొంత సేపు వేచి చూసినా డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితుడు అతడికి ఫోన్ చేశాడు. అయితే చిన్న సాంకేతిక సమస్య వచ్చిందని, మరో రూ.10 వేలు పంపితే మొత్తం రూ.40 వేలు ఖాతాలోకి వచ్చేస్తాయని నేరగాడు నమ్మబలికాడు. ఇలా ఇతడి నుంచి మొత్తం రూ.50 వేలు కాజేసిన సైబర్ నేరగాడు ఆపై స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఉదంతంలో ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.57 వేలు కాజేశారు. ఇతడు కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ ద్వారా విదేశాలకు చెందిన దావ్నే జాన్సన్ అనే సంస్థలో వాలంటీర్‌గా చేరాడు. దీనికి సంబంధించిన ఆన్లైన్ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. తమ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఇస్తామంటూ అవతలి వ్యక్తులు చెబుతూ వచ్చారు. ఓ రోజు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు సంస్థ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. సంస్థ తరఫున రూ.14 వేల విలువైన గిఫ్ట్ పంపిస్తున్నట్లు ఎర వేశారు. ఆపై కొరియర్ సంస్థ పేరుతో బాధితుడికి కాల్స్ వచ్చాయి. ఆ గిఫ్ట్‌కు సంబంధించిన తొలుత కొంత ట్యాక్స్ కట్టాలని, ఆపై మొత్తం రిఫండ్ వస్తుందని చెప్పారు. ఇలా బాధితుడి నుంచి రూ.57 వేలు తమ ఖాతాల్లో వేయించుకున్న సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
త'స్మార్ట్' జాగ్రత్త
పశ్చిమగోదావరి, తణుకు: తణుకు పట్టణానికి చెందిన నరేష్ (పేరు మార్చాం) సెకండ్‌హ్యాండ్ వస్తువులు విక్రయించే యాప్ ద్వారా ఓ స్మార్ట్‌ఫోన్ విక్రయ ప్రకటన చూశాడు. ఆ మోడల్ ఫోన్ వాస్తవ ధర సుమారు రూ.40 వేలు ఉండగా... సగం ధరకే విక్రయానికి పెట్టడం ఆకర్షించింది. ప్రకటనలో ఉన్న నంబర్‌కు ఫోన్ చేశాడు. ప్రకటనదారుడు కొద్దిసేపటికే నరేష్ సూచించిన చోటకు ఫోన్ తీసుకొచ్చాడు. ఏ మాత్రంసంకోచించకుండా నరేష్ దానిని కొనేశాడు. బిల్లు అడిగితే ప్రకటనదారుడు ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. కొన్న ఫోన్లో సిమ్ వేసుకుని నరేష్ వాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత రెండురోజులకు పోలీసులు నరేష్‌కు ఫోన్ చేసి మీరు వాడుతున్న ఫోన్ దొంగిలించినదని చెప్పారు. ఫోన్‌ను తమకు అప్పగించాలని, లేకపోతే చోరీ సొత్తు కొన్నందుకు కేసు తప్పదని మర్యాదగానే చెప్పారు. దీంతో నరేష్ వెంటనే ప్రకటనదారుడికి ఫోన్ చేశాడు. అయితే ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది. దీంతో యాప్‌లో ప్రకటన కోసం వెతికాడు. అక్కడ ప్రకటన కూడా లేదు. ఇక చేసేది లేక ఫోన్‌ను పోలీసులకు అప్పగించాడు. ఇది కేవలం ఒక్క నరేష్‌కు ఎదురైన అనుభవం కాదు. జిల్లావ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొన్న వారిలో అత్యధిక శాతం మందికి ఇదే తరహాలో పరాభవం ఎదురవుతోంది. ఆన్లైన్ వ్యాపారం ఇప్పుడు జోరందుకుంది. సరికొత్త ఉత్పత్తులు మొదలుకుని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే వెబ్సైట్లు, యాప్‌లు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఉపకరణాల ప్రకటనలు ఆకర్షిస్తున్నాయి. ఎంతో ఖరీదైనవి సగం ధరకే అనే ప్రకటనలకైతే వినియోగదారులు ఇట్టే బుట్టలో పడిపోతున్నారు. అప్రమత్తంగా లేకపోతే తక్కువ ధరకే కొన్న ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోవచ్చు. కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని సైట్లలోని ప్రకటనల ద్వారా కొనే సెకండ్ హ్యాండ్ ఫోన్లలో ఎక్కువగా చోరీ చేసినవే. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల నుంచి పోలీసులు ఆయా ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ఆధారంగా ట్రాక్ చేస్తున్నారు. దొంగలు ఒకవేళ కొట్టేసిన ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి విక్రయించినా ఐఎంఈఐ విశిష్ట సంఖ్య కావడంతో సెకండ్‌హ్యాండ్ కొనుగోలుదారులు కొత్త సిమ్ వేసిన వెంటనే పోలీసుల ట్రాకింగ్‌కు చిక్కుతోంది. ఆ ఐఎంఈఐ నంబరు కలిగిన హ్యాండ్‌సెట్‌లో ఏ కొత్త నంబరు వేశారో కనిపెట్టే పరిజ్ఞానం పోలీçసుల వద్ద ఉండటంతో సులభంగానే పసిగట్టగలుగుతున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ లభిస్తుందనే ఆశకు పోయిన నరేష్లాంటి వ్యక్తులు బాధితుల జాబితాలో చేరుతున్నారు. కొంటున్నారా...? ఇవి గమనించండి ♦ ప్రతి సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ నంబరు తప్పనిసరిగా ఉంటుంది. ఫోన్‌ను కొనేటప్పుడు బిల్లుపై ఈ నెంబరు నమోదై ఉంటుంది. ఆ ఫోన్‌కు యజమాని అనేందుకు ఆ బిల్లే ఆధారం. అందుకే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నప్పుడు కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ఐఎంఈఐ నంబరు తనిఖీ చేసేందుకు ఫోన్లో #06# టైప్ చేస్తే కొన్ని క్షణాల తర్వాత నంబరు తెరపై ప్రత్యక్షమవుతుంది. ♦ ఆ ఐఎంఈఐ నంబరు కలిగిన ఒరిజినల్ బిల్లులో యజమాని, ఫోన్ విక్రయిస్తున్న వ్యక్తి ఒకరేనా అని సరిచూసుకోవాలి. అవసరమైతే ఫోన్ అమ్మే వ్యక్తి ఫొటో, అతనికి సంబం ధించిన ఏదైనా ధ్రువీకరణ పత్రం జిరాక్సు ప్రతిని తీసుకోవాలి. ♦ అత్యవసరం ఉంది కాబట్టి తక్కువ ధరకే విక్రయిస్తున్నామని చెప్పినా... ఒరిజినల్ బిల్లు లేకుంటే మాత్రం ఎట్టిపరిస్థితితుల్లో కొనొద్దు. దొంగల చేతివాటం ఇలా... ♦ దొంగలు అసలు వినియోగదారుల నుంచి స్మార్ట్ఫోన్లను కొట్టేస్తారు. ♦ వాటిపై భాగాలను మార్చి ఆకర్షణీయంగా మార్చేస్తారు. ♦ అనంతరం వాటిని ఫోటోలు తీసి ఆన్లైన్ పోర్టల్స్, యాప్‌లు, వెబ్సైట్లలో పోస్ట్ చేస్తారు. ♦ వాస్తవ ధరకంటే తక్కువకే విక్రయిస్తామంటూ ఆకర్షిస్తారు. ♦ ఆ ఫోన్‌ను అమ్మదలిస్తే దొంగ స్వయంగా రంగంలోకి దిగుతాడు. బేరం కుదిరితే దొంగే నేరుగా వచ్చి డబ్బులు తీసుకుని సెల్‌ఫోన్ ఇచ్చేస్తాడు. ♦ సాధారణంగా దొంగలు ఫోన్ కొట్టేసిన కొద్ది రోజుల పాటు దాన్ని ఆఫ్ చేసేస్తుంటారు. ఆ సమయంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆఫ్ చేసి ఉండటంతో పోలీసుల ట్రాకింగ్‌కు చిక్కదు. ఒకట్రెండు నెలల అనంతరం ఆన్లైన్లో అమ్మకానికి పెడుతుంటారు. ♦ అప్పటివరకు స్విచ్ఛాఫ్ చేసి ఉన్న ఫోన్‌ను కొన్న వ్యక్తి ఆన్ చేయగానే పోలీసుల ట్రాకింగ్‌కు దొరుకుతుంది. ఒకవేళ కొనుగోలుదారుడు గట్టిగా మాట్లాడితే దొంగ ఫోన్ కొన్నందుకు పోలీసు కేసు ఎదుర్కోక తప్పదు. -
ఫస్ట్‌క్లాస్‌గా... సెకండ్ హ్యాండ్
‘‘ఈ టైటిల్ ‘సెకండ్ హ్యాండ్’ అయినా పాటలు, ట్రైలర్స్ మాత్రం ఫస్ట్‌క్లాస్‌గా ఉన్నాయి. బీవీయస్ రవి నాకు రెండేళ్లుగా తెలుసు. మంచి రచయిత, క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు. తనకున్న ప్రతిభను 10 శాతం వినియోగించినా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు రామ్‌గోపాల్‌వర్మ. సుధీర్‌వర్మ, ధన్య బాలకృష్ణన్, కిరీటి, అనూజ్రామ్ ముఖ్య తారలుగా మల్టీడైమన్షన్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో పూర్ణనాయుడు నిర్మించిన చిత్రం ‘సెకండ్ హ్యాండ్. బీవీయస్ రవి సహనిర్మాత. కిషోర్ తిరుమల దర్శకుడు. రవిచంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించారు. ‘‘నేను నటించిన ‘నేను మీకు తెలుసా’కి రచయితగా చేసిన కిషోర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. మంచి టాలెంట్ ఉన్నవాడు’’ అని మనోజ్ చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం సింగిల్ టేక్‌లో తీసిన పాట చాలా క్వాలిటీగా ఉంది’’ అని హరీష్‌శంకర్ తెలిపారు. బీవీయస్ రవి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని కిషోర్ అద్భుతంగా తీశాడు. అతని సోదరుల్లో ఒకరు సంగీతదర్శకుడిగా, మరొకరు ఛాయాగ్రాహకుడిగా చేశారు’’ అని చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల సుధీర్‌వర్మ, ధన్య బాలకృష్ణ, కిరీటి, అనూజ్రామ్ ఆనందం వ్యక్తం చేశారు.