
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారన్నది ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఈ విషయంపై ఇప్పటివరకు చై-సామ్ పెదవి విప్పలేదు.
మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ అక్టోబర్2న వీరు తాము భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి సమంతనే టార్గెట్ కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ నెటిజన్ సమంతను..'విడాకులు తీసుకొని పాడైన ఓ సెకండ్ హ్యాండ్ ఐటెం' అంటూ దారుణంగా దూషించాడు. అంతేకాకుండా జెంటిల్మెన్(నాగ చైతన్య) నుంచి అప్పనంగా రూ. 50కోట్లు దోచుకుందంటూ ట్వీట్ చేశాడు.
దీనిపై స్పందించిన సమంత.. నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక అంటూ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇలాంటి చెత్త కామెంట్లకు సమంత స్పందించాల్సిన అవసరం లేదని, తామంతా ఆమెకు మద్దతుగా నిలుస్తాం’ అంటూ సామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment