Khusbhu Reacts To Samantha Naga Chaitanya Divorce: నాగ చైతన్య-సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చూడముచ్చటైన ఈ జంట విడిపోవడం అక్కినేని అభిమానులే కాక నెటిజన్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సామ్-చై విడాకుల వ్యవహారంపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి ఖుష్బూ ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించింది. చదవండి: ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది: నాగ చైతన్య
'భార్య భర్తల మధ్య ఏం జరిగిందనేది వాళ్లిద్దరికి తప్పా మరెవరికి తెలియదు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికి తెలియదు. వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ఈ విషయంపై అనవరసరమైన ఊహాగానాలు, రూమర్స్ సృష్టించవద్దు' అని కోరారు. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి స్పందించిన సమంత
What happens between a couple,is between them. Nobody knows the actual reason why they part ways, except the two of them. What we can do as human is to respect their privacy n give them space to understand the situation more. Stop assuming, speculating n coming to conclusions. 🙏
— KhushbuSundar (@khushsundar) October 2, 2021
Comments
Please login to add a commentAdd a comment