Chaysam Divorce- Trolls On Preetham Jukalrkar: సమంత- నాగ చైతన్యల మూడేళ్ల వివాహ బంధానికి తెరపడింది. గత కొంతకాలంగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నా అవి నిజం కాకపోతే బాగుండు అని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. కానీ వాటినే నిజం చేస్తూ ఇక వైవాహిక బంధాన్ని కొనసాగలించలేమంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.ఏమాయ చేశావే సినిమా సమయం నుంచి దాదాపు పదేళ్ల పాటు కలిసున్న వీళ్లు భార్యభర్తలుగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తున్నారు.చదవండి:ChaySam: 'ఏ మాయ చేశావే' నుంచి 'మజిలీ' వరకు
ఈ క్రమంలో ముఖ్యంగా ఫ్యామిలీ మేన్ 2 చిత్రంలో సమంత బోల్డ్ సీన్లో నటించడం వీరి బ్రేకప్‌కు ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో సమంత తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తి కాళ్లు పెట్టుకుని ఫోటో దిగడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఎంత క్లోజ్ అయినా అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో దిగడం అభిమానులకు అంతగా నచ్చలేదు. దీంతో సమంత వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సమంత- నాగ చైతన్య విడాకులకు ప్రీతమ్ జుకల్కరే కారణం అంటూ నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు విడాకుల గురించి ప్రకటన రాగానే ప్రీతమ్ చేసిన పోస్టులు కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. దీంతో అతని ఇన్‌స్టాగ్రామ్‌కు వెళ్లి పాత పోస్టులకు వెళ్లి మరీ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరికి ప్రీతమ్ ఘాటుగానే బదులిచ్చినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. అయితే నిజానికి ప్రీతమ్ సమంతను జీజీ(అక్క)అని పిలుస్తాడు. అయినా నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తుండటంతో చేసేదేమి లేక ప్రీతమ్.. తన కామెంట్ సెక్షన్‌ని డిసేబుల్ చేసేశాడు.
చదవండి: హాట్ టాపిక్‌గా మారిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ పోస్టులు
Comments
Please login to add a commentAdd a comment