ఇండియాలో సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతుందని మార్కెట రీసెర్చ్ సంస్థలు చెబుతున్నాయి. ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ (ఐసీఈఏ) తెలిపిన వివరాల ప్రకారం 2021లో ఇండియాలో మొత్తం 2.50 కోట్ల మొబైల్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్ముడయ్యాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో సగటున ఒక్కో ఫోన ధర రూ.6,900లుగా ఉంటోంది. దీనికి సంబంధించి 2.3 బిలియన్ డాలర్ల లావాదేవీలు (ఇండియన్ కరెన్సీలో రూ.1.72 లక్షల కోట్లు) జరిగాయి.
కరోనాకి ముందు ఇండియాలో సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్‌కి ఇంత డిమాండ్ లేదు. ఐసీఈఏ లెక్కల ప్రకారం 2019 నుంచి 2021 వరకు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో 14 శాతం వృద్ధి నమోదు అయ్యింది. ఇదే ట్రెండ్ కొనసాగితే 2025 నాటికి సెకండ హ్యాండ్ ఫోన్ మార్కెట్ 5.10 కోట్ల ఫోన్ల అమ్మకాలతో 4.6 బిలియన్ డాలర్ల (రూ.3.44 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని అంచనా.
గత ఐదేళ్లుగా ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొంది. ఐదుకు పైగా కంపెనీలు పోటీ పడుతున్నాయి. క్రమం తప్పకుండా సరికొత్త ఫీచర్లతో మోడళ్లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఫలితంగా సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ పెరిగింది. 2020 వరకు 6 కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్‌లో ఉంటే 2021లోనే 9 కోట్ల మొబైల్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. ఇందులో 2.50 కోట్ల ఫోన్లు చేతులు మారాయి.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి 90 శాతం ఫోన్లు యాజ్ ఇట్ ఈజ్‌గా ఒకరి నుంచి ఒకరికి మారిపోతున్నాయి. కేవలం 5 శాతం ఫోన్లు మాత్రమే కొంచెం రిపేర్, రిఫర్బీష్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. నెలకు రూ.30 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారే సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో జరుగుతున్న లావాదేవీల్లో వీరి వాట ఏకంగా 78 శాతంగా నమోదు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment