న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రుణ(డెట్) సెక్యూరిటీల జారీ విధానాలను క్రమబద్ధీకరించేందుకు నడుం కట్టింది. ఇందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీంతో ఇక డెట్ సెక్యూరిటీల జారీ వేగవంతంకానుంది.
తద్వారా పబ్లిక్‌కు సెక్యూరిటీలను జారీ చేసే సంస్థలకు నిధులు త్వరగా అందనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం సెబీ పబ్లిక్ నుంచి స్పందన కోరే ముసాయిదా డాక్యుమెంట్ల గడువును ప్రస్తుత 7 రోజుల నుంచి 1 పనిదినానికి సవరించింది. ఇది ఇప్పటికే లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు వర్తించనుంది. ఇతరత్రా సెక్యూరిటీల జారీని చేపట్టే సంస్థలకు 5 రోజులుగా వర్తించనుంది.
జాతీయస్థాయిలో టెర్మినళ్లు కలిగి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు ఫైలింగ్ తదుపరి ఒక రోజులోనే ముసాయిదా పత్రాలను దాఖలు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో కనీస సబ్‌స్క్రిప్షన్ గడువును సెబీ 3 నుంచి 2 రోజులకు తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment