debt securities
-
సెబీ కీలక నిర్ణయం.. యూపీఐ తప్పనిసరి
న్యూఢిల్లీ: డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దిశగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా నిధులను బ్లాక్ (బ్యాంక్ ఖాతాలో స్తంభన) చేసుకునే ఆప్షన్‌తోనే రూ.5లక్షల వరకు దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది.అదే సమయంలో సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌లు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ తదితర ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పబ్లిష్ ఇష్యూలకు యూపీఐ బ్లాక్ ఆప్షన్ అవకాశం అందుబాటులో ఉన్న సంగతి విదితమే.‘‘డెట్ సెక్యూరిటీ పబ్లిక్ ఇష్యూలకు మధ్యవర్తుల ద్వారా (స్టాక్ బ్రోకర్లు, డీపీలు, రిజిస్ట్రార్ తదితర) దరఖాస్తు చేసుకునే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, దరఖాస్తు రుసుం రూ.5 లక్షల వరకు ఉంటే వారు యూపీఐ బ్లాకింగ్ ఆప్షన్నే ఉపయోగించుకోవాలి’’అని సెబీ తన సర్క్యులర్‌లో కోరింది. -
సెబీ కొత్త రూల్స్.. డెట్ సెక్యూరిటీల నిబంధనలు మార్పు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రుణ(డెట్) సెక్యూరిటీల జారీ విధానాలను క్రమబద్ధీకరించేందుకు నడుం కట్టింది. ఇందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీంతో ఇక డెట్ సెక్యూరిటీల జారీ వేగవంతంకానుంది.తద్వారా పబ్లిక్కు సెక్యూరిటీలను జారీ చేసే సంస్థలకు నిధులు త్వరగా అందనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం సెబీ పబ్లిక్ నుంచి స్పందన కోరే ముసాయిదా డాక్యుమెంట్ల గడువును ప్రస్తుత 7 రోజుల నుంచి 1 పనిదినానికి సవరించింది. ఇది ఇప్పటికే లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు వర్తించనుంది. ఇతరత్రా సెక్యూరిటీల జారీని చేపట్టే సంస్థలకు 5 రోజులుగా వర్తించనుంది.జాతీయస్థాయిలో టెర్మినళ్లు కలిగి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు ఫైలింగ్ తదుపరి ఒక రోజులోనే ముసాయిదా పత్రాలను దాఖలు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో కనీస సబ్స్క్రిప్షన్ గడువును సెబీ 3 నుంచి 2 రోజులకు తగ్గించింది. -
గిఫ్ట్ సిటీ, ఎల్ఎస్ఈలలో లిస్టింగ్
న్యూఢిల్లీ: రుణ సెక్యూరిటీలు, షేర్లను ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీతోపాటు.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎల్ఎస్ఈ)లలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు యూకేతో కలసి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాల విస్తరణకు యూకే సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వేగవంత, విస్తార ఫిన్‌టెక్ భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఇండియా– యూకే 12వ ఎకనమిక్, ఫైనాన్షియల్ సదస్సు ముగింపు సందర్భంగా సీతారామన్ పలు అంశాలను వెల్లడించారు. ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌తో ప్రారంభించి తదుపరి లండన్ లిస్టింగ్‌వైపు దృష్టిపెట్టనున్నట్లు గతంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. వెరసి తొలుత ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు మసాలా, గ్రీన్ బాండ్లను సైతం రుణ సెక్యూరిటీల లిస్టింగ్ జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్ఎస్ఈలో భారత కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ ప్రణాళికలను యూకే ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈ సందర్భంగా ప్రశంసించారు. -
రూ.11వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్బీఐ డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.11వేల కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ మేరకు టైర్ 1 అదనపు మూల ధనం సమీకరణకు అనుమతిస్తూ బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ బీఎస్ఈకి సమాచారం అందించింది. బాసెల్-3 కాంప్లియెంట్ డెట్ ఇనుస్ట్రుమెంట్లను డాలర్ లేదా రూపాయిల్లో, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. -
రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేల కోట్లు
ముంబై: భారతీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేలకోట్లకు పైగా సమకూర్చుకోనుంది. మూలధన సమీకరణకు నియమించిన డైరెక్టర్ల కమిటీ ఈమేరకు సమ్మతించిందని ఎస్బీఐ బీఎస్సీ ఫైలింగ్ లో తెలిపింది. ప్రైవేటు ప్లేస్మెంట్ ఆధారంగా రుణ సెక్యూరిటీలను సమీకరించుకోనుంది. ఎడిషనల్ టైర్ 1(ఏటీ1) మూలధనం కోసం బాసెల్-III కంప్లైంట్ డెట్ ఇన్ స్ట్రుమెంట్స్ పెంచనున్నట్టు పేర్కొంది. బుధవారం జరిగిన డైరెక్టర్ల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. విదేశీ లేదా భారతీయ పెట్టుబడిదారులను ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా అంగీకరించినట్టు పేర్కొంది. దీంతో ఎస్ బీఐ షేర్ ధర 0.08 శాతం లాభపడి రూ 254,80 వద్ద ఉంది.