న్యూఢిల్లీ: డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దిశగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా నిధులను బ్లాక్ (బ్యాంక్ ఖాతాలో స్తంభన) చేసుకునే ఆప్షన్‌తోనే రూ.5లక్షల వరకు దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది.
అదే సమయంలో సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌లు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ తదితర ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పబ్లిష్ ఇష్యూలకు యూపీఐ బ్లాక్ ఆప్షన్ అవకాశం అందుబాటులో ఉన్న సంగతి విదితమే.
‘‘డెట్ సెక్యూరిటీ పబ్లిక్ ఇష్యూలకు మధ్యవర్తుల ద్వారా (స్టాక్ బ్రోకర్లు, డీపీలు, రిజిస్ట్రార్ తదితర) దరఖాస్తు చేసుకునే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, దరఖాస్తు రుసుం రూ.5 లక్షల వరకు ఉంటే వారు యూపీఐ బ్లాకింగ్ ఆప్షన్‌నే ఉపయోగించుకోవాలి’’అని సెబీ తన సర్క్యులర్‌లో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment