న్యూఢిల్లీ: రుణ సెక్యూరిటీలు, షేర్లను ఐఎఫ్‌ఎస్‌సీ–గిఫ్ట్ సిటీతోపాటు.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎల్‌ఎస్‌ఈ)లలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు యూకేతో కలసి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాల విస్తరణకు యూకే సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వేగవంత, విస్తార ఫిన్‌టెక్ భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు.
ఇండియా– యూకే 12వ ఎకనమిక్, ఫైనాన్షియల్ సదస్సు ముగింపు సందర్భంగా సీతారామన్ పలు అంశాలను వెల్లడించారు. ఐఎఫ్‌ఎస్‌సీ లిస్టింగ్‌తో ప్రారంభించి తదుపరి లండన్ లిస్టింగ్‌వైపు దృష్టిపెట్టనున్నట్లు గతంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. వెరసి తొలుత ఐఎఫ్‌ఎస్‌సీ లిస్టింగ్‌నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు మసాలా, గ్రీన్ బాండ్లను సైతం రుణ సెక్యూరిటీల లిస్టింగ్ జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్‌ఎస్‌ఈలో భారత కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ ప్రణాళికలను యూకే ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment