Financial Conference
-
గిఫ్ట్ సిటీ, ఎల్ఎస్ఈలలో లిస్టింగ్
న్యూఢిల్లీ: రుణ సెక్యూరిటీలు, షేర్లను ఐఎఫ్ఎస్సీ–గిఫ్ట్ సిటీతోపాటు.. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎల్ఎస్ఈ)లలో లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకు యూకేతో కలసి అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాల విస్తరణకు యూకే సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వేగవంత, విస్తార ఫిన్‌టెక్ భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ఇండియా– యూకే 12వ ఎకనమిక్, ఫైనాన్షియల్ సదస్సు ముగింపు సందర్భంగా సీతారామన్ పలు అంశాలను వెల్లడించారు. ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌తో ప్రారంభించి తదుపరి లండన్ లిస్టింగ్‌వైపు దృష్టిపెట్టనున్నట్లు గతంలోనే పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. వెరసి తొలుత ఐఎఫ్ఎస్సీ లిస్టింగ్‌నకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు మసాలా, గ్రీన్ బాండ్లను సైతం రుణ సెక్యూరిటీల లిస్టింగ్ జాబితాలో చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎల్ఎస్ఈలో భారత కంపెనీల ప్రత్యక్ష లిస్టింగ్ ప్రణాళికలను యూకే ఆర్థిక మంత్రి జెరెమీ హంట్ ఈ సందర్భంగా ప్రశంసించారు. -
అన్నింటికీ ఒక్కటే కేవైసీ
న్యూఢిల్లీ: అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు వీలుగా ఉమ్మడి కేవేసీ విధానం అమలుపై పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘సెంట్రల్ కేవైసీ కోసం సెంట్రల్ రిపాజిటరీ ఉంది. అయితే, ఒక్కసారి కేవైసీ ఇస్తే పలు ఆర్థిక సంస్థల వద్ద, వేర్వేరు సమయాల్లో, పలు అవసరాలకు అది ఉపయోగపడేలా చేయడంపై దృష్టి సారించాం. దీనివల్ల ప్రతిసారీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం తప్పుతుంది’’అని పేర్కొన్నారు. దీనివల్ల వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. ఫిక్కీ లీడ్స్ 2022 కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్లకు ఉమ్మడి కేవైసీ విధానంపై ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఆర్థిక శాఖ మధ్య గత వారం సమావేశంలో చర్చ జరగడం గమనార్హం. జూలై నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.10.62 లక్షల కోట్లు దాటిందని, 628 కోట్ల లావాదేవీలు నమోదైనట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో యూపీఐ లావాదేవీలను రోజుకు 100 కోట్లకు చేర్చడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ మరింత డిజిటైజ్ అవుతుందన్నారు. ప్రభుత్వం, ఫిన్‌టెక్ సంస్థల మధ్య సయోధ్య పెరగాలి ప్రభుత్వం, ఫిన్‌టెక్ పరిశ్రమ మధ్య దూరం తగ్గాలని, సయోధ్య పెరగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీల నమ్మకాన్ని చూరగొనేందుకు పరిశ్రమ మరింత తరచుగా సంప్రదింపులు జరుపుతుండాలని ఆమె సూచించారు. ‘దూరం వల్ల అపనమ్మకం పెరుగుతుంది. కాబట్టి దూరం తగ్గించుకోవాలి. ప్రభుత్వంతో మరింతగా సంప్రదింపులు జరపాలి. ఎంత తరచుగా సంప్రదింపులు జరిగితే అంత ఎక్కువగా నమ్మకం పెరుగుతుంది‘ అని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరిశ్రమ, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం మధ్య విశ్వాసం నెలకొనేలా చూసేందుకు తీసుకోతగిన చర్యలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. చర్చించేందుకు, ఐడియాలను పంచుకునేందుకు ప్రధాని సహా ప్రభుత్వంలోని మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులు అందరూ కూడా సదా అందుబాటులోనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుందని వివరించారు. ఫిన్‌టెక్ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలను పరీక్షించుకునేందుకు, ఫలితాలను బట్టి వాటిని విస్తరించేందుకు ఆర్బీఐ రూపొందించిన శాండ్బాక్స్ విధానం తోడ్పడుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022–23లో 7 శాతం వృద్ధి భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాళ్ల నేపథ్యంలో క్రితం 8 శాతం అంచనాలను ఒకశాతం మేర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ఆర్థిక రికవరీ బాగుందని పేర్కొన్న ఆయన, ఈ దిశలో అన్ని స్తాయిల్లో మరింత సమన్వయ చర్యలు అవసరమని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో అన్నారు. కోవిడ్ అనంతర సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధికి విఘాగంగా ఉన్నాయని అన్నారు. చదవండి: క్రెడిట్,డెబిట్ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్! -
ఒకశాతం కుబేరుల చేతుల్లో 52 శాతం దేశ సంపద!
దావోస్: భారత్‌లో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతున్నాయని, దీనిని నివారించకపోతే భారత సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని అంతర్జాతీయ హక్కుల సంఘం.. ఆక్స్‌ఫామ్ హెచ్చరించింది. కుబేరుల సంపద అంతకంతకూ పెరిగిపోతుండగా, జనాభాలో సగం మందికి కూడా కనీస అవసరాలు తీరడం లేదని ఈ సంస్థ తాజా నివేదిక పేర్కొంది. ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్–డబ్ల్యూఈఎఫ్) ఆరంభం కావడానికి ముందు ఆక్స్‌ఫామ్ సంస్థకీ నివేదిక విడుదల చేసింది. పేదలు, ధనవంతుల మధ్య అంతరం భారీగా పెరిగిపోతోందని, దీనిని నివారించే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ విన్నీ బ్యాన్ఇమా కోరారు. పెరుగుతున్న అసమానతలు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా అశాంతి ప్రబలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ►భారత కుబేరుల సంపద గత ఏడాది రోజుకు రూ.2,200 కోట్లు చొప్పున పెరిగింది. ప్రపంచ కుబేరుల సంపద 12 శాతం లేదా రోజుకు 250 కోట్ల డాలర్ల మేర ఎగసింది. ప్రపంచంలోని పేదల సంపద మాత్రం 11 శాతం క్షీణించింది. ►మన దేశంలోని అత్యంత ఐశ్వర్యవంతుల సంపద 39 శాతం వృద్ధి చెందగా, జనాభాలో సగ భాగం సంపద 3 శాతమే పెరిగింది. ►భారత్‌లో అత్యంత పేదలైన 13.6 కోట్ల మంది(జనాభాలో పది శాతం) 2004 నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయే ఉన్నారు. ►వృద్ధి చెందుతున్న భారత సంపదను కొందరు కుబేరులే అనుభవిస్తున్నారని, కానీ పేదలు ఒక పూట కూడా గడవని, పిల్లలకు మందులు కూడా కొనివ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నా రు. ఇది ఇలాగే కొనసాగితే, భారత సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. ►భారత జాతీయ సంపదలో 77.4% 10 శాతం అత్యంత ధనికుల చేతుల్లోనే ఉంది. 1% కుబేరుల చేతుల్లోనే 52% జాతీయ సంపద ఉంది. ► జనాభాలోని 60 శాతం మంది చేతిలో కేవలం 4.8 శాతం సంపద మాత్రమే ఉంది. ► 9 మంది అత్యంత సంపన్నుల సంపద దేశ జ నాభాలోని సగం మంది సంపదతో సమానం. ► 2022 నాటికి భారత్‌లో రోజుకు 70 మంది కొత్త కుబేరులు పుట్టుకొస్తారని అంచనా. ►గత ఏడాది కొత్తగా 18 మంది బిలియనీర్లు అవతరించారు. దీంతో భారత్‌లోని బిలియనీర్ల సంఖ్య 119కు పెరిగింది. వీరందరి సంపద తొలిసారిగా గత ఏడాది 40,000 కోట్ల డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు పెరిగింది. ►2017లో 32,550 కోట్లుగా ఉన్న బిలియనీర్ల సంపద గత ఏడాది 44,010 కోట్ల డాలర్లకు పెరిగింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత బిలియనీర్ల సంపద ఒక్క ఏడాది ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ►భారత కేంద్ర ప్రభుత్వం, భారత్‌లోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వైద్య, ప్రజారోగ్యం, పారి శుధ్యం, నీటి సరఫరాల కోసం రూ.2,08,166 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇది భారత అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ సంపద (రూ.2.8 లక్షల కోట్లు) కంటే కూడా తక్కువే. ఇంటిపని @10 లక్షల కోట్ల డాలర్లు ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఇంటిపని విలువ సుమారుగా 10 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని ఓక్స్ఫామ్ తెలిపింది. టర్నోవర్ పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ ఆపిల్ టర్నోవర్‌కు ఇది 43 రెట్లు అని ఈ సంస్థ పేర్కొంది. భారత్‌లో గృహిణులు చేసే ఇంటిపని, పిల్లల సంరక్షణ విలువ జడీపీలో 3.1 శాతానికి సమానం. ఇలాంటి పనుల కోసం మహిళలు గ్రామాల్లో ఐదున్నర గంటలు, పట్టణాల్లో ఐదు గంటలు చొప్పున వెచ్చిస్తున్నారు. ఇలాంటి పనుల కోసం పురుషులు మాత్రం ఒక్క అరగంట మాత్రమే కేటాయిస్తున్నారు. ►వేతన వ్యత్యాసం స్త్రీ, పురుషుల మధ్య 34 శాతంగా ఉంది. ►డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ జండర్ గ్యాప్‌ఇండెక్స్‌లో భారత ర్యాంక్ 108గాఉంది. 2006తో పోల్చితే ఇది పది స్థానాలు పడిపోయింది. ►సంపన్న భారతీయుల విషయంలో కూడా స్త్రీలు బాగానే వెనకబడి ఉన్నారు. భారత్‌లో మొత్తం 119 మంది కుబేరులుండగా, వీరిలో స్త్రీల సంఖ్య 10% కూడా లేదు. కేవలం 9 మంది సంపన్న మహిళలే ఉన్నారు. మాంద్యం లేదు.. కానీ.. ప్రపంచ వృద్ధిపై ఐఎంఎఫ్ చీఫ్ లగార్డ్ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ఏమంత ఆశావహంగా లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) వెల్లడించింది. అయితే ప్రస్తుతం తలెత్తిన సమస్యలు తక్షణ మాంద్యాన్ని సూచించడం లేదని ఐఎమ్ఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డే వ్యాఖ్యానించారు. అయినప్పటికీ వృద్ధి సంబంధిత సమస్యల పరిష్కారానికి విధాన నిర్ణేతలు, ప్రభుత్వాలు సమగ్రమైన, సహకారాత్మకమైన తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరముందని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సదస్సు డబ్ల్యూఈఎఫ్సమావేశంలో మాట్లాడారు. సంస్కరణలకు తగిన సమయం.. వివిధ దేశాలు తమ ప్రభుత్వాల రుణ భారాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లగార్డే సూచించారు. గణాంకాల ఆధారంగా కేంద్రబ్యాంక్‌ల విధానాలు ఉండాలని, ఒడిదుడుకులను తట్టుకునేలా కరెన్సీ మారక విలువలుండాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, లేబర్ మార్కెట్ అంశాల్లో సంస్కరణలకు ఇదే తగిన సమయమని వివరించారు. భారత కంపెనీలే ముందు... నాలుగో పారిశ్రామిక విప్లవం సంబంధిత సమస్యల పరిష్కారంలో ఇతర దేశాల కంపెనీల కంటే భారత కంపెనీలే ముందున్నాయని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉద్యోగులకు భారత కంపెనీలు తగిన శిక్షణనిస్తున్నాయని ‘డెలాయిట్ రెడీనెస్ రిపోర్ట్’ వెల్లడించింది. అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని 2019 ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రభుత్వం, వ్యాపారం, స్వచ్చంద సేవా సంస్థలు, మీడియా అంశాల పరంగా చూస్తే, అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. భారత్ బ్రాండ్లు మాత్రం అత్యంత స్వల్ప విశ్వసనీయ బ్రాండ్లుగా నిలిచాయి. ప్రతిభలో అంతంత మాత్రమే.. గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో ఈ ఏడాది భారత్ ఒక స్థానం ఎగబాకి 80వ స్థానానికి చేరింది. ఇన్సీడ్ బిజినెస్ స్కూల్, టాటా కమ్యూనికేషన్స్, ఏడెక్కో గ్రూప్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగింది. చైనా పాత్రను భర్తీ చేసేది మనమే... ప్రపంచ ఆర్థిక వృద్ధిలో చైనా పాత్రను భర్తీ చేయగలిగే సత్తా భవిష్యత్తులో భారత్‌కు ఉందని స్పైస్‌జెట్ సీఈఓ అజయ్ సింగ్ చెప్పారు. భారత్‌లో అధికారంలో ఎవరు ఉన్నా, ఆర్థిక విధానాలపై ఏకాభిప్రాయం ఉంటుందని, వృద్ధి జోరు కొనసాగుతుందని, భారత్‌కు ఉన్న వినూత్నమైన ప్రయోజనం ఇదేనని పేర్కొన్నారు. వృద్ధి జోరు కొనసాగుతుందని డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో చెప్పారు. -
మ్యూచ్‌వల్ ఫండ్స్.. చలో ఫారిన్!
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో మన ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆస్థిరతల మధ్య కదలాడుతూ, నష్టాలను పంచుతున్నాయి. ఇందుకు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలే కారణం. దీంతో దేశీయ మ్యూచువల్ ఫండ్స్‌లో పేరొందిన పథకాల రాబడులు గత ఏడాది కాలంలో చూసుకుంటే మైనస్‌లోకి వెళ్లిపోయాయి. కానీ, ఇదే సమయంలో అమెరికా మార్కెట్లు మంచి ర్యాలీ చేస్తున్నాయి. మన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి నష్టాలు, అమెరికా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాలు అన్నట్టు పరిస్థితిలో మార్పు వచ్చింది. అందుకే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తమ విధానాలను మార్చుకుంటున్నాయి. అమెరికా తదితర విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లను సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కనీసం 10 శాతం పెట్టుబడులను విదేశీ కంపెనీలకు కేటాయించుకోవాలని నిపుణులు సూ చిస్తున్నారు. గణనీయమైన పెట్టుబడులు మన దేశ మార్కెట్లలోకి రావడం వల్లే గత రెండు సంవత్సరాల్లో భారీ ర్యాలీకి కారణంగా పేర్కొంటున్నారు. ఐఐఎఫ్ఎల్ ఏంఎసీ నుంచి పథకం ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ ‘ఐఐఎఫ్ఎల్ యూఎస్ టెక్నాలజీ ఫండ్’ను ఈ నెల్లోనే ప్రారంభించనుంది. ‘‘అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలున్నప్పటికీ భారతీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం లేదు. టెక్నాలజీ కంపెనీలైన ఫేస్బుక్, యాపిల్ గత కొన్నేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాయి. కానీ భారత ఇన్వెస్టర్లు వీటిలో పాలు పంచుకోలేదు’’ అని ఐఐఎఫ్ఎల్ ఏఎంసీ సీఈవో ప్రశస్తసేత్ తెలిపారు. ఈ తరహా పథకాలను ఈ సమయంలో తీసుకురావడం అనుకూలమని... డాలర్ బలోపేతం అవడం వల్ల ఇన్వెస్టర్లకు అదనపు రాబడులు సమకూరుతాయన్నారు. ఇటువంటివే మరికొన్ని పథకాలను తర్వాత ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు సేత్ చెప్పారు. ఉదాహరణకు... ‘‘ఈ ఏడాది ప్రారంభం నుంచి డాలర్‌తో రూపాయి 14 శాతం క్షీణించింది. అంటే ఎస్అండ్పీ500పై రూ.100 డాలర్ల ఇన్వెస్ట్మెంట్ కాస్తా రూ.114 డాలర్లు అయింది. అమెరికా స్టాక్స్ పెరుగుదల కలపకుండా చూస్తేనే ఈ మాత్రం పెరుగుదల ఉంది. డాలర్ రూపంలో చూస్తే... జపాన్, అమెరికా ఈ ఏడాదిలో 5–9 శాతం మధ్యలో రిటర్నులు ఇచ్చాయి. రూపాయి మారకంలో చూస్తే ఈ రాబడులు 20–24 శాతానికి సమానం’’ అని నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే మేము పలు అంతర్జాతీయ పెట్టుబడి అవకాశాలతో పథకాలను అందిస్తున్నాం. వీటి అవసరంపై క్లయింట్లతో మాట్లాడుతున్నాం. రూపాయి క్షీణతతో దేశీయ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన అవకాశాల కోసం చూస్తున్నారు. ఈ అవకాశాలు కేవలం అమెరికా మార్కెట్లకే పరిమితం కాదు. చైనా, యూరోప్, అమెరికా, కొన్ని ఆసియా దేశాలు సైతం ఇటీవల మంచి ర్యాలీ చేశాయి’’అని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా తెలిపారు. యాక్సిస్ నుంచి కొత్త పథకం యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఇప్పటికే యాక్సిస్ గ్రోత్ అపార్చునిటీస్ ఫండ్‌ను ఆరంభించింది. ఈ పథకం 65–70 శాతం పెట్టుబడులను దేశీయ కంపెనీలకు కేటాయిస్తుంది. 30–35 శాతం పెట్టుబడులను విదేశీ కంపెనీలకు కేటాయిస్తుంది. అమెరికా, యూరోప్, పశ్చిమాసియా, జపాన్ ప్రాంతాల్లో అవకాశాలను ఈ పథకం గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంది. బ్రిటన్‌కు చెందిన ష్రోడర్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సూచనల మేరకు పెట్టుబడులు పెడుతుంది. -
ప్రపంచ వృద్ధికి భారత్ దన్ను..
అంచనాలను నెరవేరుస్తాం... ♦ స్థిరమైన సంస్కరణలు, విధానాలతో ముందుకెళ్తున్నాం... ♦ బ్లూమ్‌బర్గ్ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు... న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ వెలుగురేఖగా నిలుస్తుందన్న అందరి అంచనాలను నెరవేరేలా చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుస్థిర విధానాలు, పాలనాపరమైన సంస్కరణలతో వృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. బ్లూమ్‌బర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరం-2016 కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ‘భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న, ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు. అత్యంత తక్కువ స్థాయిలో ద్రవ్య, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను కొనసాగిస్తున్నాం. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం. దీన్ని కేవలం అదృష్టంగా భావించకూడదు. మేం అమలు చేస్తున్న సరైన విధానాల ఫలితమే ఇది. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి విషయంలో మంచి పురోగతిని సాధిస్తోంది. అయితే, ఈ ప్రగతిని చూసి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, ఎలాగైనా తక్కువచేసి చూపాలని ఆరాటపడుతున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. దేశంలో మరింత మందికి ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ప్రధాని వివరించారు. కార్పొరేట్ రుణ ఎగవేతదారుల(డిఫాల్టర్లు) నుంచి బకాయిలను వసూలు చేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... రుణ వృద్ధి జోరందుకుంది... దేశంలో రుణ వృద్ధి గతేడాది సెప్టెంబర్ తర్వాత నుంచి జోరందుకుంది. కార్పొరేట్ రంగానికి నిధుల లభ్యత కూడా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక ఆర్థిక సంవత్సరం(2015-16) మొదటి మూడు త్రైమాసికాల్లో ఈక్విటీ, రుణాల ద్వారా నిధుల సమీకరణ 30% వృద్ధి చెందింది. అంతేకాదు, కంపెనీల క్రెడిట్ రేటింగ్‌లో కోతలకు కూడా అడ్డుకట్టపడింది. 2015-16 ప్రథమార్ధంలో రెండు కంపెనీల రేటింగ్స్ అప్‌గ్రేడ్ అయ్యాయి కూడా. మరోపక్క, దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా పెరుగుతున్నాయి. మూడో త్రైమాసికంలో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో నికర ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. ప్రధానంగా గ్రామీణ భారత్‌తో ఎక్కువగా ముడిపడిఉన్న ఎరువులు, చక్కెర, వ్యవసాయ యంత్రాల వంటి రంగాల్లోకి ఎఫ్‌డీఐల జోరు పెరిగింది. నిర్మాణ రంగంలో విదేశీ పెట్టుబడులు 316% వృద్ధి చెందగా.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో దాదాపు నాలుగు రెట్ల వృద్ధి నమోదైంది. వ్యవసాయ రంగంపై మరింతగా దృష్టిపెడుతున్నాం. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజల మద్దతుతో ఇప్పటివరకూ మా ప్రభుత్వం సాధించిన పురోగతిని చూస్తే.. భారత్‌ను మరింత ఉన్నతంగా మార్చగలమన్న నమ్మకం కలుగుతోంది. ఈ విజయాన్ని క్రూడ్ పతనంతో ముడిపెట్టొద్దు... భారత్ సాధిస్తున్న ఆర్థిక ప్రగతికి కేవలం ముడిచమురు ధరల పతనం ఒక్కటే కారణం కాదు. ఎందుకంటే చాలా వర్ధమాన దేశాలు క్రూడ్ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. మరి వాటి ఆర్థిక వ్యవస్థలు భారత్ మాదిరిగా ఎందుకు పుంజుకోవడం లేదు. 2008-09 మధ్య కూడా క్రూడ్ ధర ఇప్పటికంటే వేగంగా పడిపోయింది. అయినా అప్పుడు ద్రవ్యలోటు, క్యాడ్ చాలా అధికంగానే ఉన్నాయి. మరి ఇప్పుడు వీటిని పూర్తిగా నియంత్రణలో ఉంచగలిగాం. గడిచిన రెండేళ్లుగా ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాలను అందుకుంటున్నాం. మేం చేపడుతున్న విధానాలు, సంస్కరణలే దీనికంతటికీ కారణం. అంతేకాదు... వరుసగా రెండేళ్లపాటు కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ద్రవ్యోల్బణం కూడా భారీగా దిగొచ్చింది.