యూత్ కనెక్ట్ అయ్యారు : తనికెళ్ల భరణి | Surya Vs Surya team celebrates movie success | Sakshi
Sakshi News home page

యూత్ కనెక్ట్ అయ్యారు : తనికెళ్ల భరణి

Published Mon, Mar 9 2015 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

యూత్ కనెక్ట్ అయ్యారు : తనికెళ్ల భరణి

యూత్ కనెక్ట్ అయ్యారు : తనికెళ్ల భరణి

‘‘ ‘స్వామి రారా’, ‘ కార్తికే య’ చిత్రాల తరువాత నా సినిమాల మీద అంచనాలు బాగా పెరిగాయి. వాటిని నిలబెడుతూ ఈ సినిమా మంచి వసూళ్లతో  నడుస్తోంది’’ అని నిఖిల్ చెప్పారు. నిఖిల్, త్రిధా చౌధురి జంటగా సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ ఇటీవల విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో తనికెళ్ల భరణి మాట్లాడుతూ -‘‘పిరికివాడు ధైర్యవంతుడిగా ఎలా మారాడు అని చూపించిన విధానానికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. యంగ్ టీమ్‌ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతకు నా అభినందనలు . అన్ని పాత్రలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. కార్తీక్ మాట్లాడుతూ -‘‘క్వాలిటీ విషయంలో రాజీపడకుండా నిర్మాత చాలా బాగా సహకరించారు, సంభాషణల విషయంలో భరణి గారి తోడ్పాటు మర్చిపోలేను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శివకుమార్, నటులు ప్రవీణ్, హర్ష  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement