
అమైరా దస్తూర్, సందీప్ కిషన్
సూపర్‌స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతోన్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్ హీరోగా, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్–ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్–పి.కిరణ్ నిర్మించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఫ్రెష్, రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.
డైరెక్టర్‌గా మంజులకు తొలి చిత్రమైనా అనుభవం ఉన్నవారిలా చక్కగా తెరకెక్కించారు. ఒక మంచి సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలిగించేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా.
Comments
Please login to add a commentAdd a comment