నిజంగానే ‘మనసుకు నచ్చింది’ | Manasuku Nachindi Song Teaser | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 6 2018 3:44 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Manasuku Nachindi Song Teaser - Sakshi

సినీ రంగంలో సాంకేతికనిపుణులుగా మహిళలు అరుదుగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా దర‍్శకత్వ శాఖలో గుర్తింపు తెచ్చుకున్న మహిళలను వేళ్లమీద లెక్కపెట్టోచ్చు. తాజాగా ఈ జాబితాలో ఓ స్టార్ వారసురాలు చేరిపోయారు. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కూతురు మంజుల మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారారు.

ఫస్ట్ లుక్, టీజర్‌లతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సందీప్ కిషన్, అమైరా దస్తర్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో మంజుల కూతురు జాన్వీ వెండితెరకు పరిచయం అవుతోంది. రథన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూడో సాంగ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ‘రేయ్ ఇదే ని జాగా’ అంటూ సాగే ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement