జన్నత్ 2 సినిమాతో వెండితెరకు పరిచయమైంది నటి ఈషా గుప్తా. ఈ మధ్యే ఆశ్రమ్ 3 సిరీస్‌లో కనిపించిన ఆమె కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా ఈ విషయాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో నన్ను ఎన్నో మాటలు అన్నారు. నా ముక్కు గుండ్రంగా ఉందని, దాన్ని షార్ప్‌గా కనిపించేలా చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నా స్కిన్ మెరిసిపోయేందుకు ఇంజక్షన్ తీసుకోమని సలహా ఇచ్చారు. నేను వాళ్ల మాటలు విని దాని గురించి ఆరా తీస్తే ఒక్క ఇంజక్షన్ రూ.9000 ఉంటుందని తెలిసింది. దాని పేరు నేను చెప్పలేను కానీ చాలామంది నటీమణులు ఫెయిర్ స్కిన్ కోసం దీన్ని వాడుతున్నారు.
అందంగా కనిపించాలని తారలపై చాలా ఒత్తిడి ఉంటుంది. నేను నా కూతురిని నటిగా మాత్రం అస్సలు చూడాలనుకోవడం లేదు. ఎందుకంటే తను చిన్న వయసులో నుంచే అందంగా కనిపించాలని ఒత్తిడికి లోనవడం నాకిష్టం లేదు. ఆమె పెద్దగా చదువుకోనవసరం లేదు, కానీ గొప్ప క్రీడాకారిణి కావాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా ఈషా వెండితెరపై కనిపించి చాలాకాలమే అయ్యింది. ఆమె చివరగా 2019లో వచ్చిన టోటల్ ఢమాల్, వన్ డే జస్టిస్ డెలివర్‌డ్ చిత్రాల్లో మెరిసింది.
చదవండి: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్
నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు.. అదుర్స్ అనిపించిన బాలయ్య
Comments
Please login to add a commentAdd a comment