ఈషా టాప్‌లెస్‌ ఫొటోపై ట్రోల్స్‌, నెటిజన్లకు హీరోయిన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Esha Gupta Fires On Netizens Over Being Trolled For Her Top Less Pictures | Sakshi
Sakshi News home page

Esha Gupta: ‘ఒక చెంప మీద కొడితే, రెండు చెంపలు వాయిస్తా’ ఈషా ఫైర్‌

Published Fri, Oct 22 2021 10:00 AM | Last Updated on Fri, Oct 22 2021 12:28 PM

Esha Gupta Fires On Netizens Over Being Trolled For Her Top Less Pictures - Sakshi

ఇటీవల కాలంలో హీరోయిన్లు, మోడల్స్‌ శృతిమించిన అందాల విందుతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్‌ లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. ఇంకా వీటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా కావాల్సినంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్‌ బ్యూటీ ఈషా గుప్తా.

చదవండి: కుమారుడిని చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చిన షారుక్‌

హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ అభిమానులను అలరిస్తున్న ఈ బోల్డ్‌ బ్యూటీ ఇటీవల కాస్తా శృతిమించింది. సన్‌బాత్‌ అంటూ టాప్‌లేస్‌ ఫొటోలు షేర్‌ చేసి నెటిజన్ల మతి పోగోట్టింది. దీంతో కొందరూ ఆమె ఫొటోలకు పాజిటివ్‌గా రెస్పాండ్‌ కాగా..మరికొందరూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఆమెను ట్రోల్‌ చేస్తూ తన పోస్ట్‌పై ఆసభ్యకరంగా కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ నెటిజన్లకు చురకలు అట్టించింది.  

‘‘ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్‌ చూసి బాధపడేదాన్ని. కానీ ప్రస్తుతం అలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేశాను. వాటికి అసలు స్పందించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ నేను ఏం చేసినా కొందరు అదే పనిగా నన్ను వేలెత్తి చూపుతున్నారు. ఇటీవల నేను పంచుకున్న ఫొటోలకు అసభ్యకర రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను స్పందించక తప్పడం లేదు. చాలా మంది మేల్‌ యాక్టర్స్‌ షర్ట్‌ లేకుండా ఫొటోలు షేర్‌ చేస్తే ‘మీ బాడీ సూపర్బ్‌గా ఉంది’ అంటూ సానుకూలంగా కామెంట్‌ చేస్తారు. మరి వారిని ఎందుకు పూర్తి దుస్తులు ధరించమని చెప్పరు?’’ అని ప్రశ్నించింది. 

చదవండి: అవును..నిజమే..ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నా: నటి

‘‘ఎందుకంటే నెటిజన్లలో కొందరు లింగ వివక్ష చూపెడుతున్నారు. చీర ధరించి ఫొటో షేర్‌ చేస్తే ‘ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు’ అని వెటకారం చేస్తారు. మేకప్‌ ధరించిన ఫొటోలను పంచుకుంటే ‘ప్లాస్టిక్‌ బ్యూటీ’ అని కామెంట్లు పెడతారు. మేకప్‌ లేని ఫొటోలను షేర్‌ చేస్తే ‘నువ్వు అందంగా లేవు. ముఖానికి మేకప్‌ వేసుకో’ అని సలహాలు ఇస్తారు. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచంలోని నలుమూలలా ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. మహిళలలకు సంబంధించి మన ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక నా విషయానికొస్తే.. నేను మానసికంగా ఎంతో బలవంతురాలిని. ఎవరైనా ఒకసారి నా చెంపమీద కొడితే నేను రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను’’ అంటూ ఈషా నెటిజన్లకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. 

చదవండి: ‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement