Nikki Tamboli Responded On Being Trolled Netizens By Adult Star - Sakshi
Sakshi News home page

Nikki Tamboli: అడల్ట్ స్టార్‌ అంటూ నటిపై ట్రోల్స్.. అవేమీ కొత్త కాదన్న బ్యూటీ!

Published Mon, Aug 14 2023 8:17 PM | Last Updated on Wed, Sep 6 2023 10:11 AM

Nikki Tamboli Responded On Being Trolled Netizens By Adult Star - Sakshi

బాలీవుడ్ భామ, బిగ్ బాస్ కంటెస్టెంట్‌ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌కు సుపరిచితమే. చీకటి గదిలో చితక్కోట్టుడు అనే టాలీవుడ్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాంచన-3 చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ప్రవేశించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో తిప్పరా మీసం, అంటే సుందరానికి అనే చిత్రాల్లో కనిపించింది. హిందీ బాగ్‌బాస్‌-14 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కొన్నిసార్లు ఏకంగా మరింత హాట్ వీడియోస్‌తో రచ్చ చేస్తూ ఉంటోంది బాలీవుడ్ భామ. 

(ఇది చదవండి: స్టార్ హీరో ఉపేంద్రకు తాత్కాలిక ఊరట! )

తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమెపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తనపై ట్రోల్స్‌పై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిక్కీ సోషల్ మీడియాలో ట్రోల్స్ తనకేమీ కొత్త కాదని చెబుతోంది భామ. సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

నిక్కీ తంబోలి మాట్లాడుతూ.. 'మీరు నన్ను ఏలాగైనా పిలవండి. కానీ అవీ ఏ విధంగానూ నా స్థిరత్వ భావనను దెబ్బ తీయలేవు. సోషల్ మీడియాలో ట్రోల్ కోసమే సమయాన్ని వెచ్చించడమే పనిగా పెట్టుకున్న వ్యక్తుల ధ్రువీకరణ కోసం నేను ఇక్కడికి రాలేదు. నాతో పాటు మరెవరినైనా అడల్ట్ ఫిల్మ్ స్టార్‌తో పోల్చడమంటే మహిళలను అవమానించడమే కదా. కారణం లేకుండా మరో స్త్రీని కించపరచడం ఎందుకు? ఇలాంటి చిత్రాలను కేవలం కామం కళ్లతో ఆస్వాదించే భయంకరమైన వ్యక్తులంతా మీరే కదా? అడల్ట్ ఫిల్మ్ స్టార్ అయినప్పటికీ మానవతా విషయానికొస్తే గౌరవానికి అర్హులే కదా. మనం ఎంత స్పందిస్తే..మనపై ఇంకా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. అందుకే వాటిని పట్టించుకోను. ఏదో ఒకరోజు వారే విసుగు చెంది కామెంట్స్ చేయడం మానేస్తారు. అంతే తప్ప అవీ నా జీవితాన్ని ఎలాంటి ప్రభావితం చేయలేవు.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కూడా ట్రోలింగ్‌కు గురయ్యారు. కాగా.. నిక్కీ తంబోలి బిగ్ బాస్‌తో పాటు.. ఖత్రోన్ కే ఖిలాడి -11 సీజన్‌లో పాల్గొంది. అంతే కాకుండా అనేక మ్యూజిక్ వీడియోలు చేసింది.  

(ఇది చదవండి: 'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement