'ఆ ఇద్దరిని చూసి కామెడీ నేర్చుకుంటా' | Esha Gupta hopes to learn comedy from Abhishek, John | Sakshi
Sakshi News home page

'ఆ ఇద్దరిని చూసి కామెడీ నేర్చుకుంటా'

Published Wed, Dec 2 2015 12:27 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఆ ఇద్దరిని చూసి కామెడీ నేర్చుకుంటా' - Sakshi

'ఆ ఇద్దరిని చూసి కామెడీ నేర్చుకుంటా'

ముంబై: అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం లాంటి హీరోలతో తెరను పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తానంటోంది బాలీవుడ్ భామ ఇషా గుప్తా. అభిషేక్, జాన్ ఇద్దరి కామెడీ భిన్న తరహాలో ఉంటుంది. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రంలో వారిద్దరిని చూసి కామెడీ పాత్రల్లో నటించడంలో మెళకువలు నేర్చుకుంటానని చెప్పింది. నీరజ్ వోరా దర్శకత్వం వహిస్తున్న 'హిరా ఫెరీ 3'లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ఇషా నటిస్తున్న విషయం తెలిసిందే. 'బ్లఫ్ మాస్టర్', 'బోల్ బచ్చన్' మూవీలలో అభిషేక్ బచ్చన్ నటన తనకు నచ్చిందని, ఆ హీరోలిద్దరూ 'దోస్తానా'లో చాలా కామెడీ పండించారని చెప్పింది. అందుకే వారి నుంచి కామెడీ టిప్స్ నేర్చుకోవడంపై దృష్టిపెట్టినట్లు వివరించింది.

ఫెరోజ్ నడియాడ్వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2006లో వచ్చిన ఫిర్ హిరా ఫెరీకి సీక్వెల్. మొత్తంగా ఈ సిరీస్లో ఇది మూడో సినిమా. హమ్షకల్స్ తర్వాత ఇషా చేస్తున్న తాజా చిత్రమిది. పెద్ద బ్యానర్లో తీస్తున్న చాలా బిగ్ మూవీ అని.. ఇది తనకు చాలా గొప్ప అవకాశమని చెప్పుకొచ్చింది. ఇది తన రెండో కామెడీ ప్రధాన మూవీ అని, ఈ తరహా సినిమాల్లో నటించేందుకు కావాల్సిన ట్రిక్స్ నేర్చుకుంటానన్నది. మూవీ సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement