పెళ్లి మరో పదేళ్ల తర్వాతే..! | My wedding? Ask me after 10 years: Esha Gupta | Sakshi
Sakshi News home page

పెళ్లి మరో పదేళ్ల తర్వాతే..!

Published Mon, Aug 11 2014 11:18 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పెళ్లి మరో పదేళ్ల తర్వాతే..! - Sakshi

పెళ్లి మరో పదేళ్ల తర్వాతే..!

 మరో పది సంవత్సరాల తర్వాతే వివాహం చేసుకుంటానని బాలీవుడ్ నటి ఇషా గుప్తా తన మనసులో మాట చెప్పింది. నగరంలో జరుగుతున్న బీఎండబ్ల్యూ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ర్యాంప్‌పై నడిచిన ఈ సుందరి నవవధువు అవతారంలో అందరినీ ఔరా అనిపించింది. అయితే నిజజీవితంలో వివాహానికి మాత్రం మరో పది సంవత్సరాల సమయం కావాలని చెబుతోంది. ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం నగరానికి వచ్చిన ఈ మోడల్ తన కెరీర్ గురించి, పెళ్లి గురించిన ఆలోచనలను మీడియాతో పంచుకుంది.
 
 ‘ఓ మై గాడ్. పెళ్లా... దాని గురించి మరో పది సంవత్సరాల తర్వాత అడగండి. అంతకంటే ముందు నా అక్కకు పెళ్లి కావాలి’ అని తెలిపింది. ర్యాంప్‌పై సంప్రదాయబద్ధమైన గౌనును తొడిగినప్పటికీ పెళ్లికి మాత్రం అటువంటివి ధరించనని చెప్పింది. ‘పెళ్లికి మరో పది సంవత్సరాల వ్యవధి ఉందనే విషయం నాకు తెలుసు. ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు డిజైనర్ జ్యోత్స రూపొందించిన దుస్తులు ఎంతో బాగున్నాయి. ఆమె సృజనాత్మకత నాకు నచ్చింది. ఏదిఏమైనప్పటికీ పెళ్లి సమయంలో మాత్రం భారతీయత ఉట్టిపడే దుస్తులను మాత్రమే ధరిస్తా.
 
 అటువంటి దుస్తులను ధరించకపోతే మా అమ్మ కూడా ఊరుకోదు.’ అని తెలిపింది. కాగా ఇషా.. ఇండో బ్రిటిష్ ప్రొడక్షన్ సినిమాలో నటించేందుకు సన్నద్ధమవుతోంది. సినిమా రంగంలోకి రాకముందు మోడల్‌గా పనిచేసింది. ఈ ఫ్యాషన్‌షోలో తనను షోస్టాపర్‌గా నిలిపినందుకు జ్యోత్సకు ధన్యవాదాలు తెలియజేసింది. జ్యోత్స తివారి విభిన్నమైన దుస్తులను రూపొందించిందని, దీంతో తాను అందంగా, సరికొత్తగా కనిపించానంది. మోడలింగ్ కారణంగానే తాను షోస్టాపర్ కాగలిగానంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement