
ప్రేమపక్షులు దీపికా, రణ్‌వీర్‌లు త్వరలో ఒక్కటి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఈ అమ్మడు, తన సన్నిహితులతో కలిసి బెంగళూర్‌లో షాపింగ్ చేస్తోందని, ఇది పెళ్లి కోసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక పుట్టినరోజైన జనవరి 5న రణ్‌వీర్‌తో నిశ్చితార్థం జరిగినట్టు రూమర్స్ వస్తున్నాయి.
దీపిక తల్లిదండ్రులు కూడా రణ్‌వీర్ కుటుంబ సభ్యులను ముంబైలో కలిసి పెళ్లి తేదీల కోసం చర్చించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ జోడీ అన్ని పార్టీలకు, ఫంక్షన్‌లకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటం అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యవహారాలన్నింటిపై ఇప్పటివరకు ఈ జంట స్పందిచలేదు. ప్రస్తుతం దీపిక వెన్నునొప్పి కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. రణ్‌వీర్ రోహిత్ శెట్టి దర్శకత‍్వంలో తెరకెక్కుతున్నసింబా (టెంపర్ రీమేక్) పనుల్లో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment