Cannes 2022: Deepika Padukone On OTT Platforms Risk To Cine Industry: ప్రతిష్టాత్మక కేన్స్ 75వ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె సందడి చేసింది. ఎనిమిది మంది జ్యూరీ సభ్యుల్లో ఆమె ఒక మెంబర్‌గా మే17న వ్యవహరించింది. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తులను ధరించిన దీపికా ఈ వేడుకలో ఆకట్టుకుంది. అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో సినీ ఇండస్ట్రీకి ఏమైనా ముప్పు ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది దీపికా పదుకొణే.
'రెండు రకాల ప్రేక్షకులు ఉంటారు. కొంతమంది థియేటర్లలో చూసేందుకు ఇష్టపడితే మరికొందరు ఇంట్లో కూర్చుని వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఓటీటీల్లో చూసేవారు కూడా థియేటర్లకు వెళతారు. వారివల్ల థియేటర్స్ బతుకుతాయి. అలాగే కొన్ని కథలను ఓటీటీలోనే కొత్త ఫార్మాట్‌లలో చెప్పవచ్చు. మీరు డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోసం సినిమాను తీస్తే కథను కొత్తగా చెప్పాలి. ఈ విధంగా కథలను చెప్పడం మంచిదనే నా అభిప్రాయం. అలా అని సినీ ఇండస్ట్రీకి నష్టం కానీ ముప్పు కానీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను అవకాశంగా మాత్రమే చూస్తాను. ఓటీటీల వల్ల దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులకు అవకాశాలు పెరుగుతాయే తప్ప సినీ ఇండస్ట్రీకి ఎలాంటి ముప్పు ఉండదు.' అని దీపికా పదుకొణె పేర్కొంది.
చదవండి: ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె
Comments
Please login to add a commentAdd a comment