‘నేను వెళ్లను.. కుమార్తెను పంపను’ | Shakti Kapoor Says He Will Not Let Shraddha Resume Filming  | Sakshi
Sakshi News home page

షూటింగలకు ఓకే.. స్పందించిన శక్తి కపూర్‌

Published Fri, Jun 12 2020 4:23 PM | Last Updated on Fri, Jun 12 2020 5:11 PM

Shakti Kapoor Says He Will Not Let Shraddha Resume Filming  - Sakshi

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ అన్ని రంగాలను ప్రభావితం చేసింది. దాదాపు రెండున్నర నెలలుగా జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నెల ప్రారంభం నుంచి లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి షూటింగ్‌లకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శక్తి కపూర్ తాజా పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటకి వెళ్లి పని చేయాలని భావించడం లేదు. అలానే నా కుమార్తె  శ్రద్ధా కపూర్‌ని కూడా షూటింగ్స్‌కి పంపను’ అన్నారు. (లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా హీరోయిన్‌ పెళ్లి)

అంతేకాక ‘కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు. రానున్న రోజుల్లో వైరస్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. పని కన్నా ప్రాణాలే ముఖ్యం. షూటింగ్స్‌ ఇప్పుడు ప్రారంభమైతే పరిస్థితులు దారుణంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంత కాలం సినిమా షూటింగ్స్ చేయకపోవడమే మంచిదని నా స్నేహితులకి చెప్పాను. ఆస్పత్రి బిల్లులు కట్టడం కంటే.. మరి కొంత కాలం ఆగడం మంచిది’ అని శక్తి కపూర్ పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement