మందు బాటిల్ తెచ్చుకునేందుకు ఖాళీ చేతులతో వెళతారు. లేదంటే ఓ సంచి పట్టుకుని వెళ్తారు. కానీ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ మాత్రం పెద్ద డ్రమ్ములాంటిదే తలకెత్తుకున్నాడు. ఇంతకీ ఎందుకో చదివేసేయండి. లాక్‌డౌన్ వల్ల అందరి మనసులోనూ గూడుకట్టుకున్న కరోనా భయాన్ని కాస్త తొలగించి అభిమానులను కాసేపు హాయిగా నవ్వించేందుకు ప్రయత్నించాడు నటుడు శక్తి కపూర్. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతడు ఓ డ్రమ్ము సైజులో ఉన్న చెత్త బుట్టను తలపై ఎత్తుకుని బాహుబలిలా ప్రభాస్‌లా ఒక్కో అడుగు ముందుకేస్తూ గేటు వైపు నడిచాడు. (ఇంట గెలిచి రచ్చ గెలిచింది)
ఇంతలో ఓ వ్యక్తి 'హలో భాయ్.. ఎక్కడికి వెళుతున్నారు?' అని అడగ్గా.. శక్తి కపూర్ 'మందు కోసం' అని సమాధానమిచ్చాడు. దీంతో అతను ఆ సొసైటీ(అపార్ట్‌మెంట్ వాసులు)కోసం కూడా తీస్కురా అంటూ జోకు పేల్చాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కాగా శక్తి కపూర్ ఇప్పటివరకు 700 సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ 5వ సీజన్‌లోనూ నటించాడు. అతడి భార్య శివంగి కొల్లాపూర్. వీరిద్దరికీ సిద్ధాంత్, శ్రద్ధా కపూర్ సంతానం. వీరిద్దరూ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తమ ప్రతిభ చాటుకుంటున్నారు. (నీ అలవాటు గురించి నీకు తెలుసా.. సారీ!)
Comments
Please login to add a commentAdd a comment