శ్రద్ధా, పర్హాన్ లకు ఏమైంది? | It's total crap: Shakti Kapoor on dragging Shraddha from Farhan's apartment | Sakshi

శ్రద్ధా, పర్హాన్ లకు ఏమైంది?

Dec 30 2016 1:24 PM | Updated on Aug 18 2018 8:37 PM

శ్రద్ధా, పర్హాన్ లకు ఏమైంది? - Sakshi

శ్రద్ధా, పర్హాన్ లకు ఏమైంది?

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ లపై వచ్చిన తాజా పుకార్లపై, శ్రద్ధ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించారు.

ముంబై:  బాలీవుడ్  హీరోయిన్ శ్రద్ధా కపూర్  ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్  లపై వచ్చిన తాజా  పుకార్లపై,  శ్రద్ధ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్  స్పందించారు.   ఫర్హాన్  ఇంటినుంచి తన కూతురిని బయటకు లాక్కొచ్చేశాడన్నవార్తలను  రూమర్లని కొట్టిపారేశాడు. ఇది పూర్తిగా అవాస్తవమని  తెలిపారు. ఇదే విషయంలోతనను ఫోన్ లో కూడా  ప్రశ్నించారని.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని  పేర్కొన్నారు. తాను  35  సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలోఉన్న తను అలా ప్రవర్తించనని  శక్తి స్పష్టం చేశారు.

అయితే బాలీవుడ్ మూవీ ఆషికి తో  యూత్  లో యమ క్రేజ్ సంపాదించిన  శ్రద్ధా కపూర్,  ఫర్హాన్ అక్తర్  లపై వస్తున్న  పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డంలేదు. రాక్ 2  సినిమా  మొదలు శ్రద్ధా, అక్తర్ల  ప్రేమ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ భాగ్ మిల్కా  భాగ్  నటుడితో  పీకల్లోతు ప్రేమలో పడిన శ్రద్ధాకపూర్, ఏకంగా అతని నివాసానికే తన మకాం కూడా మార్చేసిందన్నది  బీ టౌన్   టాక్.    ఈ విషయం తెలుసుకున్న శక్తికపూర్ ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చేశారని  వార్తలు చెలరేగాయి.  వీరిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చక పోవడం వల్లే ఈ సంఘటన జరిగిందన్న వాదనలు వినిపించాయి.    

కాగా మరో హీరోయిన్, వాజిర్  మూవీలో కలిసి నటించిన  అదితిరావు, ఫర్హాన్ అక్తర్ సంబంధాలపై  అప్పట్లో బాలీవుడ్ గుప్పుమంది. మరోవైపు  సహజీవన వార్తలను శ్రద్ధా-ఫర్హాన్ ఇప్పటికే  ఖండించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement