​‘తొందరేం లేదు.. ఆమె తండ్రి చాలా రిచ్‌’ | Shraddha Has A Rich Father: Shakti Kapoor On Daughter Career | Sakshi
Sakshi News home page

​‘తొందరేం లేదు.. ఆమె తండ్రి చాలా రిచ్‌’

Published Wed, Feb 1 2017 4:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

​‘తొందరేం లేదు.. ఆమె తండ్రి చాలా రిచ్‌’ - Sakshi

​‘తొందరేం లేదు.. ఆమె తండ్రి చాలా రిచ్‌’

ముంబయి: ప్రపంచం ఆమె కాళ్ల ముందుంది. ఆమె సినీ కెరీర్‌ ఇప్పుడే వేగం పుంజుకుంటోంది. తనకు తొందరేం లేదు. ఆమె తండ్రి కూడా చాలా రిచ్‌’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శక్తికపూర్‌ తన కూతురు శ్రద్ధ కపూర్‌ గురించి అన్నారు. 2010లో టీన్‌ పట్టి అనే చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత ‘లవ్‌ కా ది ఎండ్‌’, అనంతరం ఆష్కి 2 వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం, ఏక్ విలన్‌, హైదర్‌, భాగీ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఇటీవల 2017లో ఓకే జాను అంటూ ముందుకొచ్చింది.

2016లో మ్యూజికల్‌ డ్రామా రాక్‌ ఆన్‌ 2 అనే చిత్రంలో నటించినప్పటికీ అదే సమయంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈ చిత్రంపై సరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. పైగా అంతకు ముందు నటించిన చిత్రాల్లో ఆష్కీ 2, ఏక్‌ విలన్‌, భాగీ తప్ప పెద్దగా హిట్‌ చిత్రాలు లేవు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి శక్తికపూర్‌ ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘నాలాగే నా కూతురు కూడా రిస్క్‌లు చేయదు. కూల్‌గా ఉంటుంది. సినిమాల మధ్య గ్యాప్‌ వచ్చిన తను ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఆమె తండ్రి (శక్తికపూర్‌) చాలా ధనవంతుడు. ప్రపంచం ఆమె కాళ్ల ముందే ఉంది. హర్రీబర్రీ అవ్వాల్సిన పనిలేదు. దేనినైనా తేలికగా తీసుకోవచ్చు’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement