తుపాకుల వీడియో తీగ లాగితే... ఫ్యాక్టరీయే బయటపడింది! | Madhya Pradesh Woman Washing Guns Leads to Illegal Arms Factory Bust | Sakshi
Sakshi News home page

తుపాకుల వీడియో తీగ లాగితే... ఫ్యాక్టరీయే బయటపడింది!

Published Tue, Aug 13 2024 5:11 AM | Last Updated on Tue, Aug 13 2024 11:30 AM

Madhya Pradesh Woman Washing Guns Leads to Illegal Arms Factory Bust

ఈ ఫొటోలో కని్పస్తున్న మహిళ ఏం చేస్తోందో తెలుసా? పిస్టళ్లను చక్కగా నలుగు పెట్టి మరీ కడుగుతోంది! సబ్బు వేసి బాగా తోమాలంటూ నేపథ్యంలో ఒక వ్యక్తి సూచనలిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలైంది. దాంతో మధ్యప్రదేశ్‌ పోలీసులు అప్రమత్తమై తీగ లాగితే ఏకంగా అక్రమ తుపాకుల ఫ్యాక్టరీయే వెలుగులోకి వచి్చంది. 

ఈ వీడియోలోను గణేశ్‌పుర అనే ఊళ్లో తీసినట్టు సైబర్‌ క్రైం పోలీసులు తేల్చారు. అక్కడికి చేరుకుని ఆరా తీస్తుండటంతో ఆయుధాల తయారీదారు శక్తి కపూర్‌ అలియాస్‌ చోటూ, అతడి తండ్రి బిహారీలాల్‌ అలెర్టయ్యారు. తుపాకులు, విడిభాగాలు, ఇతర సామగ్రిని గోనెసంచీలో వేసుకుని బైక్‌ మీద ఉడాయించారు. విధి వక్రించి వీరిని వెదుకుతున్న పోలీసు వ్యాన్‌కే ఎదురుపడ్డారు! దాన్ని తప్పించబోయి బైక్‌ కిందపడటంతో దొరికిపోయారు. 

గోనె సంచీలో చూడగా ఓ డబుల్‌ బ్యారెల్‌ గన్, రెండు పిస్టళ్లు, తుపాకుల తయారీ సామగ్రి కనిపించాయి. వీడియోలో విని్పంచిన గొంతు చోటూదని, తుపాకులు శుభ్రం చేస్తూ కని్పంచింది అతడి భార్య అని గుర్తించారు. ఈ యవ్వారం ఎప్పట్నుంచి సాగుతోంది, తుపాకుల తయారీకి సామగ్రి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఫ్యాక్టరీని ఎప్పటి నుంచి నడుపుతున్నారు వంటివన్నీ వారినుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. 

– భోపాల్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement