factory explosion
-
తుపాకుల వీడియో తీగ లాగితే... ఫ్యాక్టరీయే బయటపడింది!
ఈ ఫొటోలో కని్పస్తున్న మహిళ ఏం చేస్తోందో తెలుసా? పిస్టళ్లను చక్కగా నలుగు పెట్టి మరీ కడుగుతోంది! సబ్బు వేసి బాగా తోమాలంటూ నేపథ్యంలో ఒక వ్యక్తి సూచనలిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలైంది. దాంతో మధ్యప్రదేశ్ పోలీసులు అప్రమత్తమై తీగ లాగితే ఏకంగా అక్రమ తుపాకుల ఫ్యాక్టరీయే వెలుగులోకి వచి్చంది. ఈ వీడియోలోను గణేశ్పుర అనే ఊళ్లో తీసినట్టు సైబర్ క్రైం పోలీసులు తేల్చారు. అక్కడికి చేరుకుని ఆరా తీస్తుండటంతో ఆయుధాల తయారీదారు శక్తి కపూర్ అలియాస్ చోటూ, అతడి తండ్రి బిహారీలాల్ అలెర్టయ్యారు. తుపాకులు, విడిభాగాలు, ఇతర సామగ్రిని గోనెసంచీలో వేసుకుని బైక్ మీద ఉడాయించారు. విధి వక్రించి వీరిని వెదుకుతున్న పోలీసు వ్యాన్కే ఎదురుపడ్డారు! దాన్ని తప్పించబోయి బైక్ కిందపడటంతో దొరికిపోయారు. గోనె సంచీలో చూడగా ఓ డబుల్ బ్యారెల్ గన్, రెండు పిస్టళ్లు, తుపాకుల తయారీ సామగ్రి కనిపించాయి. వీడియోలో విని్పంచిన గొంతు చోటూదని, తుపాకులు శుభ్రం చేస్తూ కని్పంచింది అతడి భార్య అని గుర్తించారు. ఈ యవ్వారం ఎప్పట్నుంచి సాగుతోంది, తుపాకుల తయారీకి సామగ్రి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఫ్యాక్టరీని ఎప్పటి నుంచి నడుపుతున్నారు వంటివన్నీ వారినుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. – భోపాల్ -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరా తీసిన సీఎం కేజ్రీవాల్!
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వజీర్పూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘటనపై ఆరా తీశారు. వివరాల ప్రకారం.. వజీర్పూర్ పారిశ్రామిక ప్రాంతంలో ధర్మకాంత సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టపొగ అలుముకుంది. అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే 25 అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఘటనపై ఆరా తీశారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిదన్న కారణాలు, ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది. #WATCH | Delhi: Fire breaks out in a factory in Wazirpur area. 25 fire tenders rushed to the site. Details awaited. pic.twitter.com/OHQxxxrVTR — ANI (@ANI) March 31, 2023 -
బొమ్మల ఫ్యాక్టరీలో పేలుడు; ముగ్గురు మృతి
అలీఘడ్ : ఉత్తరప్రదేశ్ అలీఘఢ్లోని బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అలీగఢ్ ఢిల్లీ గేట్ ప్రాంతంలోని ఖాతికన్ ప్రాంతంలోని ఒక భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలీఘఢ్లోని బొమ్మల తయారీ కర్మాగారంలో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. పరిసరాల్లోని పలు ఇండ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు కారణంగా, భవనం పైకప్పు కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులపై శిథిలాలు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. కాగా క్షతగాత్రులను జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ దవాఖాన, మల్ఖన్ సింగ్ జిల్లా ఆసుపత్రులకు తరలించారు. సిలిండర్ పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచే శిథిలాలను తొలగించే పని చేపట్టారు. స్థానిక వలంటీర్ల బృందాలు సహాయక చర్యలకు సహకరిస్తున్నాయి. కాగా ఏదైనా పేలుడు కారకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయా అన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారని నగర పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ కుమార్ తెలిపారు. -
ఫ్యాక్టరీలో పేలుడు.. ఓనర్, మేనేజర్లకు శిక్ష
బీజింగ్: చైనాలో ఫ్యాక్టరీ పేలి 140 మంది చనిపోయిన కేసులో దాని యాజమాని, టాప్ మేనేజర్లు సహా 14మందికి జై లు శిక్ష పడింది. విధి నిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించి.. చైనాలో అతిపెద్ద ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదానికి కారణమైనందుకు 14 మంది నిందితులకు మూడు నుంచి ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టులు తీర్పులు వెలువరించాయని సుజూ నగర అధికారులు తెలిపారు. కుంషాన్ జాంగ్రాంగ్ మెటల్ ప్రాడక్ట్స్ కంపెనీకి చెందిన వీల్ పాలిషింగ్ ఫ్యాక్టరీలో 2014 ఆగస్టు 2నభారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 140 చనిపోగా.. 114 మంది గాయాలు అయ్యాయి.53.2 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదానికి కారణమైన ఫ్యాక్టరీ యజమానితో సహా ప్రభుత్వ ఫైర్ సెఫ్టీ అధికారులు, పర్యావరణ పర్యవేక్షణ అధికారులకు వివిధ కోర్టులు ఈ శిక్షలు విధించాయి.