ఫ్యాక్టరీలో పేలుడు.. ఓనర్, మేనేజర్లకు శిక్ష
బీజింగ్: చైనాలో ఫ్యాక్టరీ పేలి 140 మంది చనిపోయిన కేసులో దాని యాజమాని, టాప్ మేనేజర్లు సహా 14మందికి జై లు శిక్ష పడింది. విధి నిర్వహణలో అలక్ష్యంగా వ్యవహరించి.. చైనాలో అతిపెద్ద ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదానికి కారణమైనందుకు 14 మంది నిందితులకు మూడు నుంచి ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టులు తీర్పులు వెలువరించాయని సుజూ నగర అధికారులు తెలిపారు.
కుంషాన్ జాంగ్రాంగ్ మెటల్ ప్రాడక్ట్స్ కంపెనీకి చెందిన వీల్ పాలిషింగ్ ఫ్యాక్టరీలో 2014 ఆగస్టు 2నభారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 140 చనిపోగా.. 114 మంది గాయాలు అయ్యాయి.53.2 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదానికి కారణమైన ఫ్యాక్టరీ యజమానితో సహా ప్రభుత్వ ఫైర్ సెఫ్టీ అధికారులు, పర్యావరణ పర్యవేక్షణ అధికారులకు వివిధ కోర్టులు ఈ శిక్షలు విధించాయి.