Pistols
-
ఆర్మీచేతికి స్వదేశీ అస్మీ మెషీన్ పిస్టల్స్
జమ్మూ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘అస్మీ’మెషీన్ పిస్టళ్లు భారత సైన్యం చేతికొచ్చాయి. ‘‘దేశ ఆత్మనిర్భరత కార్యక్రమానికి మరింత ఊతమిస్తూ 100 శాతం భారత్ తయారీ ఆయుధాన్ని ఇండియన్ ఆర్మీ తమ అమ్ములపొదిలోకి తీసుకుంది’’అని డిఫెన్స్ జమ్మూ విభాగం ప్రజావ్యవహారాల శాఖ మంగళవారం ‘ఎక్స్’లో ట్వీట్‌చేసింది. ఇండియన్ ఆర్మీ కల్నల్ ప్రసాద్ బన్సూద్తో కలిసి సంయుక్తంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఈ పిస్టల్‌ను అభివృద్ధిచేసింది. ఈ పిస్టళ్లను హైదరాబాద్‌లోని లోకేశ్ మెషీన్స్ కర్మాగారంలో తయారుచేశారు. దీంతో కీలకమైన రక్షణ సాంకేతికలో భారత్ మరింత స్వావలంభన సాధించింది. అత్యంత చిన్నగా, తేలిగ్గా ఉండటం అస్మీ పిస్టల్ ప్రత్యేకత. శత్రువుతో అత్యంత సమీపం నుంచి పోరాడాల్సి వచ్చినపుడు వేగంగా స్పందించేందుకు ఈ పిస్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణ పిస్టల్గా, సబ్ మెషీన్గన్గా రెండు రకాలుగా వాడుకోవచ్చు. స్వల్ప, మధ్య శ్రేణి దూరాల్లోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో షూట్ చేయొచ్చు. అత్యంత వేడి, చలి వాతావరణంలోనూ ఏమాత్రం మొరాయించకుండా పనిచేస్తాయి. 8 అంగుళాల బ్యారెల్‌కు 33 తూటాల మేగజైన్‌ను అమర్చవచ్చు. 9ఎంఎం బుల్లెట్‌ను దీనిలో వాడతారు. తొలి దఫా 550 పిస్టళ్లను నార్తర్న్ కమాండ్ పరిధిలోని జమ్మూకశీ్మర్, లద్దాఖ్ సరిహద్దులవెంట పహారా కాసే భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలకు అందజేశారు. వీటి తయారీ ఆర్డర్‌ను లోకేశ్ మెషీన్స్ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చారు. -
తుపాకుల వీడియో తీగ లాగితే... ఫ్యాక్టరీయే బయటపడింది!
ఈ ఫొటోలో కని్పస్తున్న మహిళ ఏం చేస్తోందో తెలుసా? పిస్టళ్లను చక్కగా నలుగు పెట్టి మరీ కడుగుతోంది! సబ్బు వేసి బాగా తోమాలంటూ నేపథ్యంలో ఒక వ్యక్తి సూచనలిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలైంది. దాంతో మధ్యప్రదేశ్ పోలీసులు అప్రమత్తమై తీగ లాగితే ఏకంగా అక్రమ తుపాకుల ఫ్యాక్టరీయే వెలుగులోకి వచి్చంది. ఈ వీడియోలోను గణేశ్‌పుర అనే ఊళ్లో తీసినట్టు సైబర్ క్రైం పోలీసులు తేల్చారు. అక్కడికి చేరుకుని ఆరా తీస్తుండటంతో ఆయుధాల తయారీదారు శక్తి కపూర్ అలియాస్ చోటూ, అతడి తండ్రి బిహారీలాల్ అలెర్టయ్యారు. తుపాకులు, విడిభాగాలు, ఇతర సామగ్రిని గోనెసంచీలో వేసుకుని బైక్ మీద ఉడాయించారు. విధి వక్రించి వీరిని వెదుకుతున్న పోలీసు వ్యాన్కే ఎదురుపడ్డారు! దాన్ని తప్పించబోయి బైక్ కిందపడటంతో దొరికిపోయారు. గోనె సంచీలో చూడగా ఓ డబుల్ బ్యారెల్ గన్, రెండు పిస్టళ్లు, తుపాకుల తయారీ సామగ్రి కనిపించాయి. వీడియోలో విని్పంచిన గొంతు చోటూదని, తుపాకులు శుభ్రం చేస్తూ కని్పంచింది అతడి భార్య అని గుర్తించారు. ఈ యవ్వారం ఎప్పట్నుంచి సాగుతోంది, తుపాకుల తయారీకి సామగ్రి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఫ్యాక్టరీని ఎప్పటి నుంచి నడుపుతున్నారు వంటివన్నీ వారినుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. – భోపాల్ -
అపుడు రాజును బతికించిన ఐకానిక్ తుపాకీలు : ఇపుడు వేలంలో కోట్లు
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు. 1814లో విదేశీ సైన్యం పారిస్‌ను ఆక్రమించుకున్నాడు. దీంతో అధికారాన్ని కోల్పోయిన నెపోలియన్ చాలా తీవ్ర నిరాశ, ఒత్తిడికి గురయ్యాడు. ఈ కారణంతోనే ఏడాది 1814 ఏప్రిల్ 12 రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తొలుత తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాలను కున్నాడు. అయితే ఆయన వద్ద పనిచేసే అధికారి ఒకరు తుపాకీలోని పౌడర్‌ను తొలగించడంతో బతికిపోయాడు. ఆ తరువాత కూడా విషం తీసుకున్నాడు కానీ ఈ సారీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా ఇపుడు ఎందుకూ అంటే ఆ నాడు చక్రవర్తి తనను తాను చంపుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లు ఏకంగా 1.69 మిలియన్ యూరోలకు (సుమారు రూ. 15.26 కోట్లు) అమ్ముడు పోవడం విశేషంగా నిలిచింది. ఫ్రాన్స్‌లోని ఫోంటైన్‌బ్లూ ప్యాలెస్ పక్కన ఉన్న ఒసేనాట్ ఆక్షన్ హౌస్‌లో ఈ వేలాన్ని ఆదివారం నిర్వహించారు. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఈ పిస్టల్స్‌ని జాతీయ సంపదగా ఉంచాలని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం వాటి ఎగుమతిని నిషేధించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని అధికారిక పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ తిరిగి దక్కించుకునే అవకాశాలున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి 30 నెలల వ్యవధిలో పిస్తోళ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్‌ను ప్రకటిస్తే, దీన్ని తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. మరోవైపు ఫ్రాన్స్ నిబంధనల ప్రకారం దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ‘ఒసేనాట్ ఆక్షన్’ ప్రతినిధి తెలిపారు.ఈ పిస్టల్స్ స్పెషాల్టీ ఏంటి? ఈ రెండు ఐకానిక్ తుపాకులను చక్రవర్తి నెపోలియన్ బొమ్మతో బంగారం, వెండితో తయారు చేశారు. ఈ పిస్టల్స్‌ను పారిస్ తుపాకీ తయారీదారు లూయిస్-మారిన్ గోసెట్ రూపొందించారు. 1814లో నెపోలియన్ అధికారాన్ని కోల్పోయాడు. వేలం హౌస్ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ సమాచారం ప్రకారం తీవ్ర నిరాశ, ఒత్తిడితో, ఈ తుపాకీలతోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన వద్ద పనిచేసే ముఖ్య ఆర్మీ అధికారి అర్మాండ్ డి కౌలైన్‌కోర్ట్ తుపాకీలోని పౌడర్‌ను తొలగించారు. దీంతో తన పట్ల విధేయత చూపిన ఆ అధికారికి ఈ పిస్తోళ్లను బహుమతిగా అందించారట. -
విద్యార్థుల మధ్య గొడవ.. హాస్టల్ గదిలో మారణాయుధాలు..
లక్నో: చదువుకోవాల్సిన విద్యార్థుల హాస్టళ్లలో మారణాయుధాలు లభించాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హాస్టల్లో రెండు పిస్టళ్లు, 30 వరకు బాంబులు లభించాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. అదీ కాస్త తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో హాస్టల్లో తనిఖీలు చేయగా.. 2 పిస్టళ్లు, 30 బాంబులు లభించాయని పోలీసులు తెలిపారు. అయితే.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఉమేశ్ పాల్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఎస్పీ నాయకుడు రాజు పాల్‌ను కూడా దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఈ హాస్టల్లోనే తలదాచుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి -
జమ్మూ కశ్మీర్లో భారీగా మారణాయుధాలు పట్టివేత
భారత సైన్యం, జమ్ముకాశ్మీర్ పోలీసులు భారీ మొత్తంలో యుద్ధం తరహా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారు ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరీలోని హత్లాంగా సెక్టార్లో ఈ ఆయుధాలను గుర్తించారు. ఆ ఆయుధాల్లో ఎనిమిది ఏకేఎస్ 74 రైఫిళ్లు, 560 లైవ్ రైఫిల్ రౌండ్లు, 12 చైనీస్ పిస్టల్స్, 14 పాకిస్తాన్, చైనా గ్రెనేడ్లతో పాటు పాకిస్తాన్ జెండాతో కూడిన బెలూన్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు కల్నల్ మనీష్ పంజ్ చెప్పారు. ఆ ఆయుధాలు పాకిస్తాన్‌వేనని, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు కల్నల్ మనీష్ పంజ్ పాకిస్తాన్‌కి చెందిన మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసును చేధించే క్రమంలోనే ఒక రాజకీయ కార్యకర్త, కాంట్రాక్టర్, దుకాణాదారుడు, ఐదుగురు పోలీసులతో సహా సుమారు 17 మందిని పోలీసులు అరెస్టు చేసిన తర్వాతే ఈ అనుహ్య ఘటన చోటు చేసుకుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులో పౌల్ట్రీ షాపు యజమాని మహ్మద్ వసీమ్ నజర్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అతడిచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేసినట్లు తెలిపారు. (చదవండి:15 రోజుల పాటు శిక్ష..ఆప్ మంత్రికి మరో ఎదురు దెబ్బ) -
45 తుపాకులతో విమానం దిగిన జంట.. అధికారుల షాక్
ఢిల్లీ: బ్యాగుల నిండా తుపాకులతో దేశంలోకి వచ్చిన ఇద్దరు భారతీయులను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఆ పిస్తోళ్లు నకిలివా, నిజమైనవా అని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అవి నిజమైన తుపాకులేనని తెలిపారు. అరెస్టయిన ఇద్దరు జగ్జిత్ సింగ్, జస్విందర్ కౌర్‌లుగా గుర్తించారు అధికారులు. వారిద్దరినీ భార్యాభర్తలుగా నిర్ధారించారు. కాగా, వారిద్దరూ జూలై 10న వియాత్నం నుంచి భారత్‌కు వచ్చారు. జగ్జిత్ సింగ్ తీసుకొచ్చిన రెండు ట్రాలీబ్యాగుల్లో 45 తుపాకులు లభించాయి. వాటిని అతడి సోదరుడు మంజిత్ సింగ్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. జగ్జిత్ సింగ్ ఫ్రాన్స్‌లోని ప్యారీస్ నుంచి వియాత్నంకు వచ్చిన క్రమంలో ఆ ట్రాలీ బ్యాగులను మంజిత్ సింగ్‌కు ఇచ్చాడు. అందులోని మొత్తం 45 తుపాకుల విలువ సుమారు రూ.22,50,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలోనూ 25 తుపాకుల చేరవేత.. అయితే, వీరిద్దరూ ఇలా తుపాకులను చేరవేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి పిస్తోళ్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. టర్కీ నుంచి భారత్‌కు 25 తుపాకులు తెచ్చినట్లు విచారణ సందర్భంగా నిందితులు అంగీకరించారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్టు తెలిపారు. Delhi | An Indian couple that arrived from Vietnam was nabbed & 45 guns worth over Rs 22 lakh from two trolley bags seized. They admitted their previous indulgence in smuggling 25 pieces of guns having a value of over Rs 12 lakh: Commissioner of Customs, IGI Airport & General pic.twitter.com/TvjNbJt5yA — ANI (@ANI) July 13, 2022 ఇదీ చూడండి: కోవిడ్ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత? -
పిస్తోళ్లు, గునపాలు సిద్ధం చేసుకోండి.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో తుపాకులు, గునపాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గొడవలు జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే.. వారు వచ్చే లోపే దుకాణాలు తగలబడిపోతున్నాయని పేర్కొన్నారు. వారు మాత్రం ఎంతసేపు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. విక్రమ్ సైనీ ముజఫర్‌పుర్ జిల్లా ఖాతౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాన్సఠ్లోని వాజిద్పుర్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజీవ్ బాలియన్తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రసంగిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 'ఒకట్రెండు రాళ్ల డబ్బాలు, 4-5 గునపాలు, రెండు పిస్తోళ్లు మీ దుకాణాల్లో ఉంచుకోండి ' అని అన్నారు. ఆపేందుకు ప్రయత్నించినా విక్రమ్ సైనీ మాట్లాడే సమయంలో స్టేజీపై ఉన్న మరో నేత ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 'ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది, పేపర్లు, టీవీల్లో రావాలి. నన్ను ఐదేళ్ల పాటు ఎవ్వరూ పదవి నుంచి తప్పించలేరు. ఆ తర్వాత నాకు ఏ ఆశా లేదు' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారి దుమారం రేపింది. నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన వ్యక్తిని ఉదయ్‌పూర్‌లో హత్య చేసిన విషయాన్ని కూడా విక్రమ్ ప్రస్తావించారు. ఆమెకు అనుకున్నది మాట్లాడే హక్కు ఉందని పేర్కొన్నారు. చదవండి: Idris Ali: శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. -
తమ్ముడి ఇంట్లో తుపాకీ పెట్టాడు!
సాక్షి, హైదరాబాద్: సోదరుడితో ఉన్న ఆస్తి వివాదాల నేపథ్యంలో అతడిని హతమార్చాలని భావించిన అన్న నాటు తుపాకీ ఖరీదు చేశాడు. అది సాధ్యం కాకపోవడంతో కనీసం అక్రమ మారణాయుధాల కేసులో ఇరికించే కుట్ర చేశాడు. దీనిని గుర్తించిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని పట్టకున్నారు. అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ గురువారం వివరాలు వెల్లడించారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. రసూల్‌పుర ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్ అజ్మతుల్ల అలియాస్ షౌకత్ ముషీరాబాద్‌లో స్టీల్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతడికి అన్న అబ్దుల్లా, తమ్ముడు సోహైల్ ఉన్నారు. సంపన్న కుటుంబానికి చెందిన వీరికి నవాబ్కాలనీ, రసూల్‌పుర, బేగంపేట, టోలిచౌకీ, కింగ్‌కోఠి, నాచారం, ఎల్బీనగర్ల్లో రూ.వందల కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2005లో వీరి తండ్రి కన్నుమూయడంతో వీరి మధ్య ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురూ రసూల్‌పురలోని ఒకే భవనంలో నివసిస్తున్నారు. 15 ఏళ్లుగా వివాదాల పరిష్కారానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. అన్న–తమ్ముడు కలిసే తనను ఇబ్బంది పెడుతున్నారని షౌకత్ భావిస్తున్నాడు. వీరిని అంతం చేయాలని భావించిన షౌకత్ కొన్నేళ్ల క్రితం ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ సలీంను సహాయం కోరాడు. అతను రూ.5 వేలు వెచ్చించి నాందేడ్ నుంచి నాటు తుపాకీ, 10 తూటాలు, రెండు కత్తులు తీసుకువచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచి వీటిని తన వద్దే ఉంచుకున్న షౌకత్ అదును కోసం ఎదురు చూశాడు. ఈ తుపాకీ చూసిన బంధువులు లైసెన్డ్స్ ఆయుధంగా భావించారు. అన్న–తమ్ముడిని హత్య చేయడం సాధ్యం కాకపోవడంతో కనీసం కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టాలని షౌకత్ భావించాడు. కొన్ని రోజుల క్రితం తుపాకీ, తూటాలు, కత్తులను ఓ సంచిలో ఉంచాడు. దీనిని ఎవరూ చూడకుండా తన తమ్ముడి వంటింట్లో ఫ్రిడ్జ్ కింద పెట్టాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడానికి కొత్త ఫోన్, సిమ్‌కార్డు కొనుగోలు చేశారు. వీటిని వినియోగించి పదేపదే టాస్క్‌ఫోర్స్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, అనంతాచారి, అర్వింద్ గౌడ్ తమ బృందంతో ఆ ఇంటిపై దాడి చేసి సోహైల్‌ను అదుపులోకి తీసుకుని ఆయుధాలు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నేపథ్యంలో అతడికి వీటితో సంబంధం లేదని తేలింది. దీంతో కాల్ చేసింది ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీయగా షౌకత్ పేరు వెలుగులోకి రావడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం అంగీకరించడంతో తదుపరి చర్యల నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించారు. (చదవండి: రియల్ హత్యలే..దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం) -
పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!
కొన్ని సంఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవల దొంగలు కూడా రూటు మార్చారనే చెప్పాలి. ఇదివరకు దొంగలు అమాయకులు, ఒంటరివాళ్లను, వృద్ధులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడేవారు. ఇప్పుడు అత్యున్నతస్థాయి ఉద్యోగులను, బ్యాంకు ఉద్యోగులనే కాక ఏకంగా పోలీసులునే బురిడి కొట్టిస్తున్నారు. అచ్చం అలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. (చదవండి: మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ... అసలు విషయంలోకెళ్లితే...ముంబైలోని గోరేగావ్‌కు చెందిన ఖలీలుల్లా అయానుల్లా ఖాన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి తనను తాను అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) విజయ్ సింగ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ మేరకు అయానుల్లా ఖాన్పింప్రీ చించ్వాడ్ పోలీస్ చీఫ్ నంబర్ ఇవ్వవల్సిందిగా అభ్యర్థించాడు. ఆ తర్వాత కాసేపటికి అయానుల్లా ఖాన్ తానే మళ్లీ కంట్రోలో రూమ్‌కి ఫోన్ చేసి ఆయనని కలవలేకపోయాను అందువల్ల క్రైమ్ బ్రాంచ్‌లోని ఇతర పోలీసు నెంబర్లను ఇవ్వండి అని కోరాడు. ఈ క్రమంలో అయానుల్లా ఖాన్ ఒక పోలీసు అధికారికి ఫోన్ చేసి టౌన్షిప్ ప్రాంతంలో సుమారు 5 నుంచి 6 వరకు పిస్టల్స్ డెలివరీ అయ్యే అవకాశం ఉందంటూ అక్రమ ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాడు. అంతేకాదు వాట్సాప్‌లో కొంతమంది వ్యక్తుల ఫోటోలను కూడా పంపించాడు. ఈ మేరకు పూర్తి సమాచారం కొరకు అయానుల్లా ఖాన్ పోలీసులను రూ 15, 000 కూడా డిమాండ్ చేశాడు. అయితే పోలీసులు కూడా అంగీకరించి డబ్బులు పంపించారు. ఈ క్రమంలో కొంత మంది పోలీసులకు అయానుల్లా ఖాన్ తీరు పై అనుమానం వచ్చి విచారించడం మొదలు పెట్టారు. ఈ మేరకు అయానుల్లా ఖాన్ పోలీస్ కమిషనర్ పేరుతో మోసం చేసినట్ల గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్ వైరల్ వీడియో!!) -
పంద్రాగస్ట్ ముందు ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం
సాక్షి, న్యూఢిల్లీ: పంద్రాగస్ట్ వేడుకలకు ముందు ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేశారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలజడి సృష్టించాలని భావించిన దుండగుల ప్రయత్నాన్ని భద్రతా దళాలు చేధించాయి. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దుండగుల వద్ద నుంచి 55 పిస్టల్స్, 50 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎర్రకోట వైపు వెళ్లే దారులను పూర్తిగా మూసివేశారు. ఆ మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
టీడీపీ నేత తోటలో వన్య ప్రాణుల మాంసం విక్రయం
మదనపల్లి (చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షడు, నిమ్మనపల్లి మండలం ఆచర్లపల్లికి చెందిన ఆర్జే వెంకటేష్‌కు సంబంధించిన 30 ఎకరాల మామిడి తోటలో వన్యప్రాణులను చంపి మాంసం విక్రయిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు ఆదివారం ఉదయం మామిడి తోటను పరిశీలించారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడి వాటిని తోటలో వధించి వాటి మాంసం తెచ్చి పట్టణంలో విక్రయిస్తున్నట్లు బయటపడింది. తోటలో పెద్దఎత్తున అడవి పందుల మాంసం బయటపడింది. ఈ తంతు ఎన్నో రోజులుగా కొనసాగుతోంది. ముందస్తు సమాచారంతో ఆదివారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితులు పరారయ్యారు. పలు ద్విచక్రవాహనాలు పట్టుపడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కంప చెట్లలో తపంచా
ఉపాధి హామీ పనుల్లో భాగంగా కంప చెట్లు తొలగిస్తున్న కూలీలకు ఎప్పటిదో గానీ పాత కాలంనాటి ఓ తపంచా కనిపించింది. నల్లగొండ జిల్లా గుండాల మండలం పల్లెపాడు గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఈజీఎస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రామన్నపేట సీఐ గంగిరెడ్డి గ్రామానికి చేరుకుని తపంచాను స్వాధీనం చేసుకున్నారు. దానిపైన కెనాన్ అని ఇంగ్లిష్‌లో పేరు ఉంది. -
ఒక కారు..100 తుపాకులు...
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ సంఖ్యలో తుపాకులను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానస్పద రీతిలో సంచరిస్తున్న కారు సోదా చేయగా 100 ఖాళీ పిస్టల్స్ పోలీసులకు దొరికాయి. 100 పిస్టల్స్ ను స్వాధీనం చేసుకుని కారులోని ఉన్న ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాగ్డోలా గ్రామానికి వెళ్తుండగా దక్షిణ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో పోలీసులు కారును సోదా చేశారు. పోలీసులను గమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. రెండు గోనె సంచుల్లో పిస్టల్స్ ను రవాణా చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. రేసుల్లో సాధారణంగా ఇలాంటి పిస్టల్స్ ఉపయోగిస్తారు. వీటికి లైసెన్స్ లు అవసరం అని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.