ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ఫ్రాన్స్ చరిత్రపై బలమైన ముద్రవేసిన సైన్యాధ్యక్షుడు. 1814లో విదేశీ సైన్యం పారిస్‌ను ఆక్రమించుకున్నాడు. దీంతో అధికారాన్ని కోల్పోయిన నెపోలియన్ చాలా తీవ్ర నిరాశ, ఒత్తిడికి గురయ్యాడు. ఈ కారణంతోనే ఏడాది 1814 ఏప్రిల్ 12 రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తొలుత తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాలను కున్నాడు. అయితే ఆయన వద్ద పనిచేసే అధికారి ఒకరు తుపాకీలోని పౌడర్‌ను తొలగించడంతో బతికిపోయాడు. ఆ తరువాత కూడా విషం తీసుకున్నాడు కానీ ఈ సారీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా ఇపుడు ఎందుకూ అంటే ఆ నాడు చక్రవర్తి తనను తాను చంపుకోవడానికి ఉపయోగించాలని భావించిన రెండు పిస్తోళ్లను వేలం వేయగా భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించిన వేలంలో ఈ రెండు పిస్తోళ్లు ఏకంగా 1.69 మిలియన్ యూరోలకు (సుమారు రూ. 15.26 కోట్లు) అమ్ముడు పోవడం విశేషంగా నిలిచింది.
ఫ్రాన్స్‌లోని ఫోంటైన్‌బ్లూ ప్యాలెస్ పక్కన ఉన్న ఒసేనాట్ ఆక్షన్ హౌస్‌లో ఈ వేలాన్ని ఆదివారం నిర్వహించారు. అయితే కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఈ పిస్టల్స్‌ని జాతీయ సంపదగా ఉంచాలని భావించిన ఫ్రాన్స్ ప్రభుత్వం వాటి ఎగుమతిని నిషేధించింది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని అధికారిక పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్తోళ్లను ఫ్రాన్స్ తిరిగి దక్కించుకునే అవకాశాలున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
అయితే కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి 30 నెలల వ్యవధిలో పిస్తోళ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక వేళ ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్‌ను ప్రకటిస్తే, దీన్ని తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. మరోవైపు ఫ్రాన్స్ నిబంధనల ప్రకారం దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ‘ఒసేనాట్ ఆక్షన్’ ప్రతినిధి తెలిపారు.
ఈ పిస్టల్స్ స్పెషాల్టీ ఏంటి?
ఈ రెండు ఐకానిక్ తుపాకులను చక్రవర్తి నెపోలియన్ బొమ్మతో బంగారం, వెండితో తయారు చేశారు. ఈ పిస్టల్స్‌ను పారిస్ తుపాకీ తయారీదారు లూయిస్-మారిన్ గోసెట్ రూపొందించారు. 1814లో నెపోలియన్ అధికారాన్ని కోల్పోయాడు.
వేలం హౌస్ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ సమాచారం ప్రకారం తీవ్ర నిరాశ, ఒత్తిడితో, ఈ తుపాకీలతోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన వద్ద పనిచేసే ముఖ్య ఆర్మీ అధికారి అర్మాండ్ డి కౌలైన్‌కోర్ట్ తుపాకీలోని పౌడర్‌ను తొలగించారు. దీంతో తన పట్ల విధేయత చూపిన ఆ అధికారికి ఈ పిస్తోళ్లను బహుమతిగా అందించారట.
Comments
Please login to add a commentAdd a comment