లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో తుపాకులు, గునపాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గొడవలు జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే.. వారు వచ్చే లోపే దుకాణాలు తగలబడిపోతున్నాయని పేర్కొన్నారు. వారు మాత్రం ఎంతసేపు పనిచేస్తారని వ్యాఖ్యానించారు.
విక్రమ్ సైనీ ముజఫర్‌పుర్ జిల్లా ఖాతౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాన్‌సఠ్‌లోని వాజిద్‍పుర్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజీవ్ బాలియన్‌తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రసంగిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 'ఒకట్రెండు రాళ్ల డబ్బాలు, 4-5 గునపాలు, రెండు పిస్తోళ్లు మీ దుకాణాల్లో ఉంచుకోండి ' అని అన్నారు.
ఆపేందుకు ప్రయత్నించినా
విక్రమ్ సైనీ మాట్లాడే సమయంలో స్టేజీపై ఉన్న మరో నేత ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 'ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది, పేపర్లు, టీవీల్లో రావాలి. నన్ను ఐదేళ్ల పాటు ఎవ్వరూ పదవి నుంచి తప్పించలేరు. ఆ తర్వాత నాకు ఏ ఆశా లేదు' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారి దుమారం రేపింది.
నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన వ్యక్తిని ఉదయ్‌పూర్‌లో హత్య చేసిన విషయాన్ని కూడా విక్రమ్ ప్రస్తావించారు. ఆమెకు అనుకున్నది మాట్లాడే హక్కు ఉందని పేర్కొన్నారు.
చదవండి: Idris Ali: శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా..
Comments
Please login to add a commentAdd a comment