mujafarnagar
-
‘మేం గెలిస్తే ప్రత్యేక రాష్ట్రం’
లక్నో: తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా మార్చేందుకు తమ పార్టీ గట్టి చర్యలు తీసుకుంటుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ముజఫర్‌నగర్ లోక్‌సభ స్థానం బీఎస్పీ అభ్యర్థి దారా సింగ్ ప్రజాపతికి మద్దతుగా మాయావతి ప్రచారం నిర్వహించారు. ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాయావతి మాట్లాడుతూ బీజేపీకి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. "పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇందుకోసం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం" అని మాయావతి చెప్పారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఓటింగ్ యంత్రాలను తారుమారు చేయకుంటే ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని బీఎస్పీ చీఫ్ అన్నారు. ముజఫర్‌నగర్‌లో బీజేపీ నుంచి సంజీవ్ కుమార్ బల్యాన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి హరేంద్ర సింగ్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ తన ర్యాలీకి ముందు, మాయావతి సహరాన్పూర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొత్తం ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
బాలుడిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన టీచర్..
లక్నో: యూపీలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని టీచర్ ఒక ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన సంఘటన పెను సంచలనంగా మారింది. విద్యార్థిని కొట్టించడం సంగతి అటుంచితే ఆమె మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో కూడా అగ్గి రాజుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ అమానుషంగా వ్యవహరించి పసి మనసుల్లో మత విద్వేషాలను నాటే ప్రయత్నం చేసిందని తెలిపారు యూపీ పోలీసులు. వీడియో ఆధారంగా యూపీ పోలీసులు టీచర్‌పైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. How humiliating for a small child to be put through this at a young age. Making the Muslim boy stand in front of the whole class and getting the Hindu kids to come and slap him. That teacher needs a slap tbh pic.twitter.com/n1KDWtTTwQ — Abu Hafsah (@AbuHafsah1) August 25, 2023 పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. టీచర్ కొట్టించిన బాలుడు ముస్లిం. టీచర్ కచ్చితంగా మతపరమైన దూషణలు చేసినట్టు వీడియోలో స్పష్టమైందని అయితే ఆమె నైజం ఏమిటన్నది విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ ముస్లిం విద్యార్థి గణిత పట్టికలను నేర్చుకోలేదని మతపరమైన దూషణ చేస్తూ తోటి విద్యార్థులను ఆ బాలుడిపై దాడి చేయమని ఉసిగొల్పారన్నారు. బాలల హక్కుల సంఘం కూడా టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాలుడి తండ్రి పాఠశాల యాజమాన్యం రాజీకి వచ్చిందని తాము కట్టిన ఫీజును కూడా తిరిగి చెల్లించిందని ఇకపై తమ బిడ్డను ఆ పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయంపై స్పందించే ఉద్దేశ్యం తనకు లేదని దీన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గాంధీ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవిత్రమైన పాఠశాలలో పిల్లల మనసుల్లో విద్వేషాలను నాటడం కంటే దేశద్రోహం మరొకటుండదు. ఇది దేశాన్ని బుగ్గిపాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పోసిన ఆజ్యమే. చిన్న పిల్లలు దేశ భవిష్యత్తు. వారిని ద్వేషించకుండా ప్రేమతత్వాన్ని నేర్పాలని అన్నారు. मासूम बच्चों के मन में भेदभाव का ज़हर घोलना, स्कूल जैसे पवित्र स्थान को नफ़रत का बाज़ार बनाना - एक शिक्षक देश के लिए इससे बुरा कुछ नहीं कर सकता। ये भाजपा का फैलाया वही केरोसिन है जिसने भारत के कोने-कोने में आग लगा रखी है। बच्चे भारत का भविष्य हैं - उनको नफ़रत नहीं, हम सबको मिल… — Rahul Gandhi (@RahulGandhi) August 25, 2023 మరో ఎంపీ జయంత్ సింగ్ స్పందిస్తూ.. హింసను రెచ్చగొడుతూ మైనారిటీలకు వ్యతిరేకంగా మతవిద్వేషాలు ఎంత లోతుగా పాతుకుపోయాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూడాలని.. పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. Muzaffarnagar school video is a painful warning of how deep rooted religious divides can trigger violence against the marginalised, minority communities. Our MLAs from Muzzafarnagar will ensure that UP Police files a case suomoto & the child’s education is not disrupted! — Jayant Singh (@jayantrld) August 25, 2023 ఇది కూడా చదవండి: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
పిస్తోళ్లు, గునపాలు సిద్ధం చేసుకోండి.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాపారస్తులు తమ దుకాణాల్లో తుపాకులు, గునపాలు, రాళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గొడవలు జరిగినప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే.. వారు వచ్చే లోపే దుకాణాలు తగలబడిపోతున్నాయని పేర్కొన్నారు. వారు మాత్రం ఎంతసేపు పనిచేస్తారని వ్యాఖ్యానించారు. విక్రమ్ సైనీ ముజఫర్‌పుర్ జిల్లా ఖాతౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాన్సఠ్లోని వాజిద్పుర్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజీవ్ బాలియన్తో పాటు ఈయన కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రసంగిస్తూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 'ఒకట్రెండు రాళ్ల డబ్బాలు, 4-5 గునపాలు, రెండు పిస్తోళ్లు మీ దుకాణాల్లో ఉంచుకోండి ' అని అన్నారు. ఆపేందుకు ప్రయత్నించినా విక్రమ్ సైనీ మాట్లాడే సమయంలో స్టేజీపై ఉన్న మరో నేత ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 'ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి. నేను మాట్లాడేది, పేపర్లు, టీవీల్లో రావాలి. నన్ను ఐదేళ్ల పాటు ఎవ్వరూ పదవి నుంచి తప్పించలేరు. ఆ తర్వాత నాకు ఏ ఆశా లేదు' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అది వైరల్‌గా మారి దుమారం రేపింది. నూపుర్ శర్మకు మద్దతు తెలిపిన వ్యక్తిని ఉదయ్‌పూర్‌లో హత్య చేసిన విషయాన్ని కూడా విక్రమ్ ప్రస్తావించారు. ఆమెకు అనుకున్నది మాట్లాడే హక్కు ఉందని పేర్కొన్నారు. చదవండి: Idris Ali: శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. -
విద్యార్థుల భోజనంలో చచ్చిన ఎలుక
లక్నో : ఉత్తరప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం మరోసారి అభాసుపాలైంది. విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎలుక రావడం కలకలం రేపింది. ఈ ఆహారం తిన్న తొమ్మిది మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్ కూడా అస్వస్థతకు గురయ్యారు. తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు... ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆరో, ఎనిమిదో తరగతి విద్యార్థులకు మంగళవారం ఆహారం వడ్డించారు. అయితే అది తిన్న కాసేపటి తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. భోజనం పాత్రను పరిశీలించగా అందులో ఎలుక చనిపోయి ఉంది. దీంతో వెంటనే విద్యార్థులను, ఓ టీచర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ భోజనాన్ని హాపూర్‌కు చెందిన జన్ కల్యాణ్ సంస్థా కమిటీ అనే ఎన్జీవో తయారు చేసినట్లు సమాచారం.(చదవండి: లీటరు పాలు.. బకెట్ నీళ్లు..) ఇక ఈ ఘటనపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ విషయం తన దృష్టికి రావడంతో ముజఫర్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. కాగా యూపీలో మధ్యాహ్న భోజన పథకంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం యూపీలోని మీర్జాపూర్లో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రోజూ రోటీ- ఉప్పు, అన్నం- ఉప్పు పెడుతున్న విషయాన్ని ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకువచ్చారు. అదే విధంగా సోనభద్ర జిల్లాలోని పాఠశాలలో నవంబరు 29న లీటరు పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైంది. -
బిహార్‌లో హాహాకారాలు
ముజఫర్‌పూర్/ పట్నా / న్యూఢిల్లీ: బిహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను ఈ మహమ్మారి బలి తీసుకుంటోంది. సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు ఈ వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 103కు చేరినట్లు శ్రీ కృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్) సూపరింటెండెంట్ సునీల్ కుమార్ షాహి సోమవారం తెలిపారు. ఇలావుండగా ఎస్‌కేఎంసీహెచ్ ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్‌కేఎంసీహెచ్‌లో సౌకర్యాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. -
లిచీ పండ్లకు.. పిల్లల ప్రాణాలు హరీ!
ముజఫర్ పూర్: బీహార్‌లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన బాలల మరణాలకు లిచీ పండ్లు కారణమా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. మెదడువాపును పోలిన వ్యాధి కారణంగా ఈ ప్రాంతంలో గత 12 రోజుల్లో దాదాపు 50 మంది పదేళ్ల వయసులోపు పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ పిల్లలు అక్యూట్ ఎన్సెఫలైటీస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరినా.. చాలామంది రక్తంలో చక్కర మోతాదులు అకస్మాత్తుగా తగ్గిపోయాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి అశోక్ కుమార్ సింగ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశామని.. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పామని అశోక్ కుమార్ వివరించారు. ప్రస్తుతం శ్రీక్రిష్ణ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో 40 మంది పిల్లలు ఇదే రకమైన లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. లిచీ పంటకు పేరు.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రాంతం లిచీ పండ్లకు పెట్టింది పేరు. గతంలోనూ ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించిన సంఘటనలు ఉన్నాయి. వేసవిలో పిల్లలు తోటల్లో ఆడుకుంటూ ఈ పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారని.. ఈ క్రమంలో రాత్రి భోజనం మానేస్తూంటారు. అయితే లిచీ పండ్లలో ఉండే హైపోగ్లైసిన్ సైక్రోప్రొపైల్ అసిటిక్ ఆసిడ్ రాత్రి పూట రక్తంలోని చక్కెర మోతాదులను గణనీయంగా తగ్గించి వేస్తుందని లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. పదేళ్ల లోపు పిల్లలు ఉదయాన్నే ఇతర ఆహారం ఏదీ తీసుకోక ముందు లిచీ పండ్లు తినకూడదని బీహార్ ఆరోగ్యశాఖ సూచించింది. ఒకవేళ పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకోకుండా లిచీ పండ్లు తిని ఉంటే రాత్రి వేళలో వీలైనంత తొందరగా ఆహారం తీసుకోవాలని సూచించింది. -
ఉద్యోగం ఇప్పిస్తానని మహిళపై..
ముజఫర్ నగర్ : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళకు పరిచయం ఉన్న ఆర్.కే మెహతా అనే వ్యక్తి ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఉద్యోగం కోసం అతను చెప్పిన చోటుకు వెళ్లగా.. తాగే కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి మెహతా అతని స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. జాతీయ రహదారిపై కదులుతున్న కారులో నుంచి మూడు సంత్సరాల ఆమె కుమారున్ని కిందకు విసిరేసి ఈ అరాచకానికి ఒడిగట్టారు. రోడ్డుపై పడి ఉన్న బాలున్ని గ్రామస్తులు హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అత్యాచారం అనంతరం ఆ మహిళను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన పోలీసులు దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
హంతకులు సెల్ఫీలు..
సాక్షి, ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లో నేరస్తులు జైళ్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చక్కా ఫోన్లు మాట్లాడుకుంటూ వాటిల్లోనే సెటిల్మెంట్లు చేసుకుంటూ, దర్జాగా ఫొటోలు దిగుతూ తమకే దిగులు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ విషయం కాస్త బయటకు పొక్కడంతో ఇప్పుడు తీవ్రస్థాయిలో జైలు శాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇంతకు వారు ఏం చేశారో తెలుసా.. ముజఫర్‌నగర్ జైలులో ఉన్న ఓ ముగ్గురు ఖైదీలు ఏకంగా జైలు సెల్ఫీలు దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వీరు ముగ్గురిపై కూడా హత్య కేసులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అయితే, జైలులో ఖైదీల వద్ద ఎలాంటి సెల్ఫోన్లు ఉండొద్దని నిబంధన ఉన్న విషయం తెలిసిందే. కానీ, వాటన్నింటిని ఖాతరు చేయకుండా వారు విచ్చలవిడిగా ఫోన్లు వాడటం, వారు వాడుతున్న విషయాన్ని ఇలా బాహటంగా బయటపెట్టడంతో అధికారులు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం ఆ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై అదనంగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
తలాక్ చెప్పి భవనంపై నుంచి తోయడంతో..
సాక్షి, ముజఫర్‌నగర్ : ఓ పక్క దేశవ్యాప్తంగా త్రిపుల్ తలాక్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతోపాటు చట్టసభల్లో ధుమారం రేగుతుండగా మరోపక్క, ట్రిపుల్ తలాక్ సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యకు అకారణంగా ట్రిపుల్ తలాక్ చెప్పడంతోపాటు భవనంపై నుంచి తోసేశాడు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు అక్కడి పోలీసులు తెలియజేస్తూ.. ‘బాధితురాలు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఎముకలు కూడా విరిగిపోయాయి’ అని చెప్పారు. ఈ నెల (జనవరి) 15న గర్ముక్తేశ్వర్ ఆలయ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె భర్త పరారీలో ఉన్నారని వెల్లడించారు. వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల రక్షణకోసం మరో ట్రిపుల్ తలాక్ బిల్లును ఇప్పటికే లోక్‌సభలో ఆమోదించిన విషయం తెలిసిందే. -
ఆస్పత్రి వద్దంది... అంబులెన్స్‌లో ప్రసవించింది
ముజఫర్ నగర్: పౌర సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్యాలయం దారి తప్పిన ఉదంతమిది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి కొచ్చిన మహిళకు సేవలు అందించాల్సిందిపోయి.. కనీసం మానవత్వం కూడా లేకుండా లంచం ఇస్తేనే చేర్చుకుంటామని ఓ ప్రభుత్వాస్పత్రికి చెందిన నర్సులు చేసిన వాలకం వల్ల ఆమె అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అమీర్ అనే వ్యక్తి నిండు గర్భవతి అయిన తన భార్యకు ప్రసూతి నొప్పులు రావడంతో సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. అయితే, అందులోని ఆస్పత్రి సిబ్బంది లంచం ఇస్తేనే చేర్చుకుంటామని ఇబ్బందిపెడుతూ ఆలస్యం చేయడంతో అమీర్ భార్య అంబులెన్స్‌లో ప్రసవించింది. అనంతరం ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. బాధితుల తరుపున బంధువులు, కుటుంబ సభ్యులు సదరు ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నాకు దిగడంతో ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు ఆస్పత్రి సిబ్బందిపై కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.