
ప్రతీకాత్మక చిత్రం
ముజఫర్ నగర్ : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళకు పరిచయం ఉన్న ఆర్.కే మెహతా అనే వ్యక్తి ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఉద్యోగం కోసం అతను చెప్పిన చోటుకు వెళ్లగా.. తాగే కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి మెహతా అతని స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
జాతీయ రహదారిపై కదులుతున్న కారులో నుంచి మూడు సంత్సరాల ఆమె కుమారున్ని కిందకు విసిరేసి ఈ అరాచకానికి ఒడిగట్టారు. రోడ్డుపై పడి ఉన్న బాలున్ని గ్రామస్తులు హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అత్యాచారం అనంతరం ఆ మహిళను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన పోలీసులు దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment