Woman gang raped
-
ఉద్యోగం ఇప్పిస్తానని మహిళపై..
ముజఫర్ నగర్ : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళకు పరిచయం ఉన్న ఆర్.కే మెహతా అనే వ్యక్తి ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. ఉద్యోగం కోసం అతను చెప్పిన చోటుకు వెళ్లగా.. తాగే కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి మెహతా అతని స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. జాతీయ రహదారిపై కదులుతున్న కారులో నుంచి మూడు సంత్సరాల ఆమె కుమారున్ని కిందకు విసిరేసి ఈ అరాచకానికి ఒడిగట్టారు. రోడ్డుపై పడి ఉన్న బాలున్ని గ్రామస్తులు హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అత్యాచారం అనంతరం ఆ మహిళను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన పోలీసులు దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
తెలిసిన మహిళను లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఇద్దరు దుండగులు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. మీరట్ జిల్లా సార్దన ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. 40 ఏళ్ల బాధితురాలకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. వీళ్లలో ఒకడు ఆమెకు తెలిసినవాడు కావడంతో వెంట వెళ్లింది. కాస్త దూరం వెళ్లాక ఆమెకు తెలియకుండా మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆమె డ్రింక్ తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇద్దరూ ఆమెను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు బాధితురాలిని అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితురాలు స్పృహలోకి వచ్చాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. -
ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై అత్యాచారం
టీనగర్ : ధర్మపురి సమీపంలో ప్రియుడితో కలిసి వెళుతున్న ప్రియురాలిపై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే తిరునల్వేలిలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ప్రియుడి కళ్లెదుటే కామాంధులు ప్రియురాలిపై తమ ఘాతుకాన్ని ప్రదర్శించారు. కన్యాకుమారి జిల్లా తిట్టువిలై ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్ అరివాల్ తిరునల్వేలి జిల్లాలో కంప్యూటర్ సేల్స్, సర్వీస్ చేస్తుంటారు. ఈయన నాగర్‌కోయిల్ ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి బైక్‌పై వివిధ ప్రాంతాలను సందర్శించి సాయంత్రం తమ ఊరికి బయలుదేరారు. ఈ జంట ఒంటరిగా వెళ్లడం గమనించిన ముగ్గురు వ్యక్తులు వారిని వెంబడించి నాంగునేరి కళక్కాడు రోడ్డులో జీయ్యర్ కుళం సమీపాన వారిని అటకాయించారు. తర్వాత ప్రేమికుడిని ఒక చెట్టుకు కట్టివేసి ప్రియురాలిని వారు ముగ్గురూ కలిసి లాక్కెళ్లారు. అక్కడున్న పొదల్లోకి ఆమెను తీసుకు వెళ్లి ఒకరి తర్వాత మరొకరు ఆమెపై లైంగిక దాడి జరిపారు. ఆ సమయంలో ప్రేమికుడు అరివాల్ను బెదిరించి అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్, రెండు సెల్ఫోన్లను అపహరించి పరారయ్యారు. దీనిపై అరివాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతిని పోలీసులు నాగర్‌కోయిల్‌లో ఆమె బంధువుల ఇంటిలో చేర్చారు. -
రేప్ చేసి ... డబ్బు కోసం బెదిరిస్తున్నారు!
తాము కోరినంత డబ్బులు ఇవ్వకుంటే నగ్నంగా ఉన్న ఫొటోలు బహిర్గతం చేస్తామంటూ తనను బెదిరిస్తున్నారంటూ అత్యాచారానికి గురైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాణసవాడి సమీపంలోని సెమినరీ (నన్స్ ట్రైనింగ్ సెంటర్)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి(16) శిక్షణకు వచ్చింది. బైరసంద్ర లే ఔట్లోని మూడవ క్రాస్‌లో ఉన్న సిస్టర్స్ హోలీ క్యాంపస్‌లో ఉంటున్న ఆమెపై ఈ నెల 16న గుర్తు తెలియని ఇద్దరు అత్యాచారం చేసి ఉడాయించారు. ఆ రోజు కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీశానని, ఆ సమయంలో నల్ల డబ్బాలోని ద్రావకాన్ని తనపై స్ప్రే చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. రాత్రి స్నేహితులు వస్తున్న సమయంలో మెలుకవ వచ్చి చూసుకున్నప్పుడు తాను నగ్నంగా కాంపౌండ్ ఆవరణంలో పడి ఉన్నానని వివరించింది. తన కాలిపై ‘అడిగిన సొమ్ము ఇవ్వకుంటే నగ్నంగా ఉన్న ఫొటోలను మీడియాకు ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్లో కూడా పెడతామంటూ రాసి ఉందని తెలిపింది. అత్యాచారం చేసిన దుండగులను గుర్తు పట్టగలనని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు హెణ్ణూరు పోలీసులు తెలిపారు.